Showing posts with label బలిదానాలు వద్దు తెలంగాణా ముద్దు. Show all posts
Showing posts with label బలిదానాలు వద్దు తెలంగాణా ముద్దు. Show all posts

Wednesday, August 11, 2010

ఒక్క రక్తపు బొట్టు రాలకుండా ఉద్యమాన్ని నడిపిద్దాం..!

తమ్ముల్లారా , చెల్లల్లారా .....! మరణాన్ని మనం శాసిద్దాం...! ఒక్క రక్తపు బొట్టు రాలకుండా ఉద్యమాన్ని నడిపిద్దాం ...! చావు దేనికీ సమాధానం కాదు .... బ్రతికి సాదిద్దాం ...వాదిద్దాం ...కాదంటే తెగవడి ..కలవడి ... రాష్ట్రాన్ని సాధించుకుందాం. మీరు మాత్రం తొందర పడేది లేదు. మనకు మనమున్నాం ..మనతో పాటు మన మేధావులు, ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, OU&KU JAC లు , ఉరూర వాడవాడనా ఊ అంటే చాలు ఉరికచ్చే ముక్కోటి జనసంద్రం వున్నరు. మీకు చింత అక్కర లేదు . మీ పరిది లో మీరు ఉద్యమిస్తే చాలు మిగతా అంతా మీ సహోదరులైన కోట్లాది తెలంగాణ వాదులం మేం జూసుకుంటం.

మీలో చిరునవ్వులు చూస్తేనే కదా మాలో ఉద్యమ స్పూర్తి రగిలేది ....మీ ఉరకలేసే ఉడుకు రక్తపుపిడికిలి కనిపిస్తేనే కదా మాకు పరుగులచ్చేది.... తమ్మీ మళ్ళీ మళ్ళీ చెపుతున్నాం ...మేమున్నాం మేమున్నాం మేమున్నాం.

కన్నవారి కడుపు కోత ను ఆలోచిద్దాం ... తెలంగాణ పులిబిడ్డలై బైలెల్దాం ..!

మన తల్లుల కడుపు కోతకు మనం కారణం కారాదు . వాళ్ళు మన మీద ఎన్నో ఆశలు వెట్టుకున్నరు. వారి శ్వాశ, ఆశ మనమే .... ! మన భవిష్యత్తు కోసమే వారి ఎదిరిచూపు ... దాన్ని తెలంగాణ లో సూడ దలిచిన్రు ... వాళ్ళ ఆశల్ని మనం అడియాశలు చేయరాదు. తమ్ముల్లారా ..... చెల్లెల్లారా ... మన ఆశ తెలంగాణ మన శ్వాశ తెలంగాణ ...దానికోసం దండు గడదాం .... దారి కి ముందు నడుద్దాం. ఎదురొచ్చిన ముండ్ల కంపల్ని ఏరుకుంట అగ్గివెడదాం.

ఇంకెప్పుడూ .... ఇలా తొందర పడమని నిర్నయిన్చుకుందం. నిలవడి నిప్పునైనా ఎదుర్కొందాం ... నిజాయితీగా పోరు చేద్దం ......కొదమ సింహాలై ముందుకురుకుదాం...!

తెలంగాణ తల్లి సాక్షిగా ప్రతిన తీసుకుందాం ..! మళ్ళీ ఎలాంటి కటిన నిర్ణయాలకు వెళ్ళమని... గర్భ శోకం మిగల్చమని.
రండి ...... ఇంటి దొంగల పనిపడదాం ..! బయటి దొంగల తరిమికొడదాం ...!


జై తెలంగాణ ..! జై జై తెలంగాణ ...!!

Thursday, August 5, 2010

ఆత్మార్పణ లింకొద్దురా

ఆత్మార్పణ లింకొద్దురా
బలిపీఠ మెక్కవద్దురా.., ఆత్మార్పణ లింకొద్దురా...
త్యాగాల చరిత మనదిరా, పొరాడి గెలువసాగరా
జై తెలంగాణ-జై తెలంగాణ, జై తెలంగాణా
"బలిపీఠం"-------
శ్రీకాంత్ దేహమెందుకు, పెనుమంటలల్లో కాలెను
పోలీస్ కిష్టయ్య తన ప్రాణ మెందుకిచ్చెను
మల్లేషం మంజులలు భార్యభర్తలయ్య
మూడు పదులు దాటిన ప్రేమ ముర్తులయ్య
ఎన్నేండ్లు వేదనంటూ, మాగుండె కోతనంటూ
ప్రశ్నించెవారి మరణం ఇక మిశ్రమించలేము
సలాం అమరులారా-సలాం అమరులారా
సలాం అమరులారా ........
"బలిపీఠం"-----
డిసెంబర్ తొమ్మిదొక, చీకటి రోజందుమా
పదకొండు గురి త్యాగపు, వెలుగు రేఖ లందుమా
విశ్వవిద్యాలయాల విద్యర్థుల పిడికిల్లు
వీధులన్ని అట్టుడికిన ప్రజా పోరు కెరటాలు
ఉరికొయ్య తీగవద్దు, పోరాటమాపవద్దు
పార్లమెంటు బిల్లుదాక, సల్లారదు మాకాక
సలాం అమరులారా-సలాం అమరులారా
సలాం-అమారులార......
"బలిపీఠం"
జై తెలంగాణ..!
జై జై తెలంగాణ...!

ఉరికే ఉరుకుల ఉద్యమ స్వరమా

ఉరికే ఉరుకుల ఉద్యమ స్వరమా
ఉరికే ఉరుకుల ఉద్యమ స్వరమా ఆ పరిమళం..
నేస్తమా, నీ ప్రాణం చేయకుమా ఇక బలిదానం..
తడుమును మమ్ముల..తడి ఆరని నీ తొలి స్వప్నం..
చితికే బ్రతుకుల చివరి పోరాటం..
ఆరని మంటల బ్రతుకొక ఆరాటం..
యేమో యేమయ్యిందో..
రాజీపడని నీ ధైర్యం..
యేమో యేమయ్యిందో..
వెనకకు తగ్గని నీ స్థైర్యం..
లేమా.. నీ వెనుకా.. లక్షలు కోట్లుగ మేమంతా..
రామా... కదలి రామా .. నీ అడుగున అడుగై మేమంతా..
ఒక్కొక్కటైన ఆశలన్నీ వెలగాలింక జ్యోతులుగా..
కన్నీళ్ళ రోజులు పోయి రావాలింకా తెలంగాణ..
చూడవా ఓ నేస్తం మాతోటీ నీ ఆశల స్వప్నం..
మానుకో, ఆపుకో నీ అంతిమ యత్నం..
ఆగవా.. వినవా.. ఒకసారీ మా విన్నపం..
చేద్దాం,.. సాధిద్దాం.. మన కలలన్నీ సాధిద్దాం..
రేపటి రోజులు మన వాడల్ల వెలుగులనే ఇక చూద్దాం..
నేస్తమా నీ ప్రాణం..
చేయకుమా ఇక బలిదానం..

Monday, August 2, 2010

తెగించి పోరాడు గాని ఆత్మహత్యకు తెరదించకురా.

తెగించి పోరాడు గాని ఆత్మహత్యకు తెరదించకురా...

నీకోసం ఈ తెలంగాణ నీ వాళ్ళ కోసం ఈ తెలంగాణ
నువ్వే ఓడినంక ఇంకేవాడికి రా ఈ తెలంగాణ
నువ్వే నీరు గారి పోతే... నీ తమ్ముల కల నీరు గారెరా...
ఇట్లా ఒక్కొక్కడు పోతుంటే తెలంగాణ సైన్యం లో
ఇంకెట్ల వొస్తది రా నువ్వు కోరుకున్న మన తెలంగాణ...
నీలాంటి వీరులు మా పాలిట కన్నీరు కాకూడదు
తెలంగాణ పోరు బాట ఇది కాదుర తమ్ముడా...
తెగించి పోరాడు గాని ఆత్మహత్యకు తెరదించకురా...


ఆత్మాహుతి సమిధలు కాదురా...
అలుపెరుగని వీరులు కావలి...
అమ్మ నాన్న అన్నదమ్ముల కోసం
తెలంగాణ సాధించే ధీరులు కావలి...
దిగమింగలేని దుఃఖం మిగిలించే దీన స్థితి మనకొద్దురా...
నీ లాగ నేను చెయ్య... ఇంకోడిని చేయ్యనియ్య...
నీ బాటల నేను రాను... ఇంకోడిని రానియ్య...
తెలంగాణ పోరు బాట ఇది కాదుర తమ్ముడా...
తెగించి పోరాడు గాని ఆత్మహత్యకు తెరదించకురా...