Thursday, August 5, 2010

యుద్ధం చేసి అలిసిపోయినట్టూ చతికిల పడ్డారేం

అంతా అయిపోయినట్టూ
యుద్ధం చేసి అలిసిపోయినట్టూ చతికిల పడ్డారేం
దిక్కులు చూస్తున్నారేం
తెగ ఆయాసపడి పోతున్నారేం
ఇంకా అసలు యుద్ధం మొదలవ్వ లేదు
ఆకాశంలో అక్కడక్కడా మేఘాలు కూడుకుంటున్నాయి
భూమి పొరల్లో చిన్నగా జ్వరం మొదలయ్యింది

అక్కడో మెరుపూ ఇక్కడో మెరుపూ కాస్త ఆశను కలిగిస్తున్నాయి
అక్కడో చుక్కా ఇక్కడో చుక్కా

కనపడీ కనపడనట్టు చీకట్లో దోవని చూపిస్తున్నాయి
అంతా అయిపోయినట్టు
సమస్తం సాధించినట్టు విశ్రాంతి తీసుకుంటున్నారేం కాళ్ళు బార్ల చాపి
వీపు సంసారం గోదాకానించి సుఖనిద్ర పోతున్నారేం
కాస్త ఊపిరాడక పొయ్యేసరికి
జెండాలన్నీ చుట్టచుట్టి చంకనబెట్టి
'తునా బొడ్డుమ్బాల్' అని చేతులెత్తేశారేం
ఆవిరికమ్మి చెమట పట్టటం మొదలయ్యేసరికి
రాసుకున్న ఎర్రరంగు కరిగిపోవటం మొదలయ్యింది
యుద్ధం చేసినట్టూ
విజయం సాధించినట్టూ
జయకేతనం ఒక అట్టముక్క ముక్కుకి వేళ్ళాడేసుకుని
బజార్లన్నీ ఊళ్ళన్నీ దేశాలన్నీ కలియదిరుగుతున్నారేం
ఇంకా యుద్ధం మొదలవ్వలేదురా - నాయనా
ఇప్పుడిప్పుడే కాస్త యుద్ద వాతావరణ మేర్పడుతోంది
పిండదశలోనే బిడ్డను కన్నంత శ్రమపడుతున్నారేం
వర్శమొచ్చే సూచనలున్నాయి - రా - బయటికి - రా
-- కే.శివారెడ్డి 8 October 1987

జై తెలంగాణ జై జై తెలంగాణ

శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి



No comments:

Post a Comment