Saturday, August 7, 2010

పోరు చరిత By Krishna Vamshi Allam

పోరు చరిత - By Krishna Vamshi Allam,[ Must Read ]
జై తెలంగాణాని ఉయ్యాలొ,
బతుకు పోరుజెయ్య ఉయ్యల!

మానీళ్ళు మాకోసం ఉయ్యాలొ,
మాపోరుసాగంగ ఉయ్యాల!

యాభయ్యేండ్లసంది ఉయ్యాలొ,
అణుచుకుంటిమి బాధ ఉయ్యాలొ!

మా జాగ మాకేనని ఉయ్యాలొ,
జంగు సైరనూదినాము ఉయ్యాల!

ఇన్నేండ్ల తండ్లాట ఉయ్యాలొ,
తెలంగాణ రావలే ఉయ్యాల!

యూనివర్సిటిలల్ల ఉయ్యాలొ,
ఉద్యమించే బిడ్డలు ఉయ్యాల!

ఉద్యమాల సదువులు ఉయ్యాలొ,
ఉగ్గుపాల బట్టె ఉయ్యాల!

ప్రశ్నించే దిక్కులు ఉయ్యాలొ,
గర్జించే సింహాలు ఉయ్యాల!

హక్కులు కోరితె ఉయ్యాలొ,
మక్కలిరగతన్నె ఉయ్యాల!

కొవ్వొత్తి బట్టిన ఉయ్యాలొ,
కేసులు బెట్టిరి ఉయ్యాల!

లాఠీ చార్జిలల్ల ఉయ్యాలొ,
నెత్తుర్లు పారేను ఉయ్యాల!

చిందిన నెత్తురు ఉయ్యాలొ,
పారేను పల్లెల్లొ ఉయ్యాల!

దిక్కులన్నికూడి ఉయ్యాలొ,
ఉక్కుపిడికిలై లేచె ఉయ్యాల!

చినుకులన్నీ కూడి ఉయ్యాలొ,
తుఫాను పుట్టింది ఉయ్యాల!

చిన్నోల్ల పెద్దోల్ల ఉయ్యాలొ,
చేతులన్నీ కలిసె ఉయ్యాల!

పొడిసేటి పొద్దుల్లొ ఉయ్యాలొ,
పొరుబాటన సాగె ఉయ్యాల!

బువ్వబందులు చేసి ఉయ్యాలొ,
భూమికొసం పోరె ఉయ్యాల!

బందులు చేసిరి ఉయ్యాలొ,
బలిదానలిచ్చిరి ఉయ్యాల!

నినదించి జనమంత ఉయ్యాలొ,
నిరహర దీక్షలు ఉయ్యాల!

గొంతులో పొలికేకలు ఉయ్యాలొ.
యుద్ద నాదములాయే ఉయ్యాల!

ఆత్మా గౌరవము ఉయ్యాలొ,
మేముగోరినాము ఉయ్యాల!

న్యాయపోరాటము ఉయ్యాలొ,
నిప్పుల్ల మండింది ఉయ్యాల!

కాసోజు శ్రీకాంతు ఉయ్యాలొ,
మండేటి సూర్యుడు ఉయ్యాల!

నిలువెల్లా మంటల్ల ఉయ్యాలొ,
నినాదమిడవలే ఉయ్యాల!

బలిదానలెన్నున ఉయ్యాలొ,
బతుకులు మారలె ఉయ్యాల!

మాకొలువు మాకంటే ఉయ్యాలొ,
మమ్ముల కొట్టిరి ఉయ్యాల!

మా అవ్వే తెలంగాణా”...- అల్లం వీరయ్య.

మా అవ్వే తెలంగాణా”...- అల్లం వీరయ్య.

“మా అవ్వే తెలంగాణా”
కొండకోనల వెండివెలుగుల
గిరుల సిరులు పైరునగలు
మొగులునంటిన కరుణమూర్తి
ముక్కోటీబిడ్డల కలలధాత్రి
మా అవ్వ గదరా తెలంగాణా
మా బువ్వ గదరా తెలంగాణా..
కోట్లగొంతులు కలిసిపాడిన
ప్రత్యేక రాష్ట్రము కలలకోన
“మా అవ్వ”

గుట్టమీద చెట్టు కొమ్మన
గువ్వ పాడిన పాట పల్లవి
వాననిచ్చే కారుమబ్బులు
ఒరిసిమెరిసిన మెరుపు తల్లిది
గోదారిక్రుష్ణ నదుల మధ్యన
పరుచుకున్న పంటచేనుర
గుండెనిండిన మాట తానై
గోరుముద్దలు కొసిరిపెట్టే..
“మా అవ్వ”

పాలకంకుల జొన్న చేలు
తెలంగాణ తల్లి కరములమరు
తల్లిబిడ్డను ఎత్తినట్లుగ
మక్కపీసు తలను నిమురు
తామరాకులు కలువపూల
చెరువుదొరువులు నీటిసంపద
నా తల్లికేమి తక్కువాయెర
తలనువంచి మొక్కవేమిర
“మా అవ్వ”

కోస్తనుండి చుట్టరికము
కలుపుకొచ్చిరి మోసగాళ్ళు
సీమనుండి దిగిరి కొందరు
చింతలప్పుడె మొదలుకదరా
మద్రాసునిడిచిన శని ఇపుడు
మనల గట్టిగ పట్టుకున్నది
మాయమాటల మూటలల్లి
కొలువునెలువులు దోచినారు
నీటివనరులు మలిపినారు
నిండమనలను ముంచినారు
పావలర్ధకు భూమి దోచి
చేలు చెలుకలు చేతబట్టిరి
మనకంటిలొ మన ఏలుపెట్టీ
వాడునింగికి ఎదిగినాడు
చెరనుబట్టిరి తెలంగాణ తల్లిని
అనాధలైతిమీ నేలమీద..
“మా అవ్వ”

తెలుగు తల్లి అమ్మగాదు
మము పెంచిపెద్ద చెయ్యలేదు
గామె మాకు అవ్వ అయితె
నల్లగొండ నాగమల్లి
గామె మాకు అవ్వే అయితె
పాలమూరూ పాలవెల్లి
మెదకు జిల్లా బతుకుమారు
వరంగల్లు వెతలుతీరు
కరువుకాటకములు రెండు
కలిసినమిలి మింగె గదరా
ఎటూ చూసిన ఎడారేను
ఎటు పారెను జీవనదులు
మా పాలివానికిది పాలవెల్లి
పగవానిదె ఆ తెలుగు తల్లి..
“మా అవ్వ”

తల్లి చెరను బాప బిడ్డల
తండ్లాట యేబదేండ్లది
అమరులైన బిడ్డల కొరకు
తల్లి శోకము యేబదేండ్లది
గుండెపగిలి తల్లడిల్లిన
పేరు పేరున పిలిచి తలిచే
“మా అవ్వ”
రావణా సమ్హారమునకు
రణము ఒకటే మిగిలినట్టు
చావొ రేవో తేలెదాక
పోరాటమొక్కటె మార్గమున్నది
తెలంగాణ విముక్తి కొరకు
రండీరన్న లెండిరన్నా
కదం కదము కలిపి నడిచి
కదనరంగమున దుముకుదామూ….

మా అవ్వ గదరా తెలంగాణా
మా బువ్వ గదరా తెలంగాణా…..
-- అల్లం వీరయ్య

రాంకి వేస్ట్ రసాయనాలు శుద్ధి కేంద్రం Videos

రాంకి వేస్ట్ రసాయనాలు శుద్ధి కేంద్రం Video

రాంకి వేస్ట్ రసాయనాలు శుద్ధి కేంద్రం

రాంకి వేస్ట్ రసాయనాలు శుద్ధి కేంద్రం
రాంకి రసాయన శుద్ధి కేంద్రం,2001 లో చంద్ర బాబు నాయుడు చేత దుండిగల్ గ్రామంలో స్థాపించడం జరిగింది,అప్పటి నుండి ప్రతి రోజు 200 లరీలతో .సుమారు 678 పరిశ్రమల యొక్క71,923 టన్నుల వ్యర్ధ రసాయనాలను మన తెలంగాణా లోని పలు ప్రాంతంలో కుమ్మరియడం జరుగుతుంది, దీని వాళ్ల నాల్గు జిల్లాల ప్రజలు ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలు ఎదుకోవల్శివస్తుంది,దాదాపు వంద కిలోమీటర్ల వరకు దీని ప్రబావం ఉంటుంది, ఈ బయన్కరమైన రసాయనలవల్ల చర్మ వ్యాదులు, ఉపిరి తిథుల వ్యాదులు, ఆడవాళ్లలు అబోర్షన్లు ఐతున్నై,ఈ రసాయనాలు మన తెలంగానై గూడా కాదు సీమంద్ర నుంచి సుమారు 750-800 కిలోమీటర్ల దిరం నుంచి తెచ్చి ఈడ పోస్తుండ్రు, ఈ చెత్త రసాయనలుదో సీమంద్రల్నే పోయోచుకద ఎందుకంటే గాడ ఆంధ్రోల్ల పానాలకు కస్తామైతది గందుకే గీడ పోస్తున్రు,గీ పరిశ్రమలు ఎవర్వో కాదు సీమ MlaT.G VENKATESH గానియి ఇంకోటేమో విష్ణు చేమికాల్స్ధీ,సుసిన్ర ఆంధ్రోల్ల తెలివితేటలు,లాబాలు, ఉద్యోగాలు వల్లి రోగాలేమో మన తెలంగానోల్లకి ఇదేనా సమైక్యంద్ర అంటే

నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం

నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం .
తెలంగాణా...
ఓ తెగిన వీణ!
నిప్పుకణికల రుద్ర వీణ !

శ్వాస శ్వాస ఉప్పెనై ,లక్షమే ఇక ప్రాణమై ,
చేయి చేయి పిడికిలై ,పౌరుషం పది ఇంతలై ,
కన్ను కన్ను ఎర్రనై ,గుండెమంటే జ్వాలయై ,
నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం .

మదపుటేనుగు మంకుపట్టు ,వచ్చితీరుతా నని మిడిసిపాటు ,
యువరాజా వారికి తేలినట్టు ,దేశం ఎపుడో స్వేఛ్చ పొందినట్టు .
సింహం జూలు తో ఓదార్పు ఆట ,కాలుదువ్వితే ఇక కనువిప్పే బాట ,
పొలిమేర నుండే పొలికేక ,ఓరుగల్లున మోగింది సమరఢంకా .

రాయి,రాయి ఒక శాసనం,సమైక్య వాదం పై సమాధి మండపం,
పోరు దారిన వీర మరణం, తల్లి తెలంగాణకి రక్త తిలకం,
రుద్రమ గడ్డ మీద రౌడీ కోట,తరిమికోడుతడి ఇక తెలంగాణ ప్రతి పూట,
తెలంగాణ ఓ తెగిన వీణ! నీవు మా కోటి వజ్రాల విజయ వీణ.

తెలంగాణాలో ఆంధ్రుల అక్రమ పాలనకి మరణశాసనం

మిత్రులారా,
భస్మాసురుడు తన హస్తంతో తానే భస్మం చేసుకున్నట్లు ఆంధ్రా స్పీకర్ కిరణ్ కుమార్ తన పక్షపాత, నీచ బుద్ధ్హితో తెలంగాణా MLA ల రాజీనామాలు ఆమోదించి అసెంబ్లీలో కొంత కాలం తెలంగాణా గొడవ లేకుండా ఉండేటట్లయితే చేసినాడు గాని ఆ రాజీనామాలు ఆంధ్రా అక్రమ పాలనకి ఇంత సులువుగా అంతిమ గీతం పాడుతాయని ఎవరూ ఊహించలేదు.ఏరు దాటినంక తెప్ప తగలేసినట్లు 2009 లో ఒక నీచ రాజకీయ నాయకుడు, Y.S.R నాటకమాడి తెలంగాణా ను నట్టేట ముంచినాడు. ఆ పైన ఎన్నికలు ముగుస్తుండగా వెధవ కామెంట్లు చేసినాడు. వాడి నీచ ప్రవృత్తిని నిస్సుగ్గుగా చాటుకున్నాడు. కాని తెలంగాణా ప్రజలు అప్పటికే మోస పోయినారు. వారికి 2014 వరకు మళ్ళీ అవకాశం లేక పోయింది. అంతలోనే వాడు పోవడం, KCR మళ్ళీ నిరాహార దీక్షతో తెలంగాణా ఉద్యమానికి ఊపిరులూదడం ఇన్నాళ్లూ తొక్కి పెట్టిన ఒక చారిత్రక ఘట్టానికి తెర లేపింది.నేనే పెద్ద మొనగాన్నని విర్ర వీగిన కిరణ్ కుమార్ అనాలోచితంగా తెలంగాణాకు మరిచిపోలేని మేలే చేశాడు.వీడికి తోడు కాంగ్రెస్స్, తెలుగు దేశం పార్టీ రెండూ రాజీనామాలు చేయకుండా, పోటుగాళ్ళ లాగా ఎలెక్షన్ లలో నిలబడి తెలంగాణా కి సరిదిద్దుకోలేని మేలు చేశారు. వారు పెద్ద గోతిని తవ్వి దానిలోనే పడి బయటకు వచ్చే దారి లేకుండా చేసుకున్నారు.పోటీ చేయక పోయినా తెలంగాణకు మేమూ అనుకూలం అని చెప్పుకుని తెలంగాణా ప్రజలని ఎప్పటిలాగానే మోసం చెయ్యగలిగే వాళ్ళు. ఇప్పుడు అది కూడా పోయింది. కాంగ్రెస్స్, తెలుగు దేశం మోసమే చేస్తాయి అని ఎలా వోటర్లని ఈ పార్టీ ల మోసాల్నుంచి కాపాడాలో తెలియని మాకు ఒక రాజ మార్గం చూపించారు. వేల కృతఙ్ఞతలు. ఇప్పుడేమో ఏమీ చేయలేక సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. మేం కూడా ప్రత్యేక రాయలసీమ కోసమా రాజీనామా చేస్తే బ్రహ్మాండమైన మెజారిటీ తో గెలిచే వాళ్ళమని, మనిషి కుక్కని కరిస్తే వింత అని, కుక్క మనిషిని కరిస్తే వింత కాదని, వారి సీట్లు వారు గెలుచుకోవడం వింత కాదని, 2014 లో మళ్ళీ పుంజుకుంటామని వెధవ మాటలు మాట్లాడుతున్నారు. అసలు కుక్క వీలను కరిచినట్లుంది.
ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటం చేస్తామనే వాళ్లకి మేమేం చెప్తున్నామో అర్థం కానట్లుంది. మేమూ అదే విడిపోదామనే చెప్తుంది. దోపిడులు, దౌర్జన్యాలు ఇంకా ఎన్నాళ్ళో సాగవు. ప్రపంచాన్నంతటినీ ఆక్రమించిన బ్రిటిష్ వాళ్ళనే వెళ్ల గొట్టాం మనం. ఒక నిజాం నవాబుకి వ్యతిరేకంగా ఏళ్ళ తరబడి పోరాడాం. ఒక ఆంధ్రా ఆక్రమణ దాని ముందు ఎంత. బ్రిటిష్ వాళ్లకి పట్టిన గతే వీళ్ళకూ పడ్తుంది. కాకపొతే పాపాలు ఇప్పుడే పండినాయి. ఇక అయి పోయింది.ఒక జాతిని మరొక జాతి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ పీడించే సంస్కృతి ఇంకానా, ఇకపై సాగదు – శ్రీ శ్రీ అనే ఒక ఆంధ్రా కవి చెప్పిన ఈ మాటలు తెలంగాణా విషయం లో సరిగ్గా సరిపోతాయి.ఆంధ్రా మిత్రులారా కళ్ళు తెరవండి. దోపిడీ, దౌర్జన్యం ఎన్నాళ్ళో సాగవు. మూలకు నెడితే, సర్వస్వం దోచుకుంటే పిల్లి అయినా తిరగబడుతుంది. అబద్ధాలు, నక్క జిత్తులు ఎంతో కాలం మోసం చేయ లేవు.ఇది ఆంధ్రా వారి తెలంగాణా ఆక్రమణకు చరమ గీతం.తెలంగాణా ప్రజలు మేమూ మనుష్యులమే అని గొంతెత్తి అరుస్తున్నారు. మా రాజ్యాన్ని మీరు అక్రమించుకుని మాకు తిండి లేకుండా దోచుకోవడం అన్యాయం ఇకపై సాగదని ఆక్రోశిస్తున్నారు. వారి ఆపేక్షలని వినండి. మనుష్యుల్లా ఇప్పటికైనా ఇంకొకరి ఆవేదనని అర్ధం చేసుకోండి. వారి ఆకాంక్షలకి విలువివ్వండి. మనమందరం ఒక మంచి మిత్రులుగా రెండు విడి రాష్ట్రాలుగా 1952 నుండి 1956 వరకు ఎలా వుండే వారిమో అలాగే మళ్ళీ ఉందాం. ఆంధ్ర వాళ్ళు, ఆ మాటకొస్తే దేశంలోని అన్ని ప్రాంతాల వారు తెలంగాణా లో పెట్టుబడులు పెట్టొచ్చు. అటు ఆంధ్రా అభివృద్ధికి, ఇటు తెలంగాణా అభివృద్ధికి పాటు పడొచ్చు.
జై తెలంగాణా!
మీ మిత్రుడు,
విజయకృష్ణ చాట్ల