Wednesday, March 31, 2010

స్వతంత్ర తెలంగాణా రాష్ట్రం మా జన్మ హక్కు

స్వతంత్ర తెలంగాణా రాష్ట్రం మా జన్మ హక్కు ఆంధ్ర సీమ రాజకియవేతల కుటిల ఎత్తులు,
కుసంస్కారం. నాలుకలు చీరేస్తామనే సంస్కారం ఒక్క ఆంధ్ర సీమ రాజకీయవేతలకు సొంతం.
నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో నోటికి వచ్చినది వాగితే వారి పాత్ర
బట్టబయలౌతుంది. ఇలాంటి మాటలు మాట్లాడితే అరేబియా దేశాల్లో ముందు కటకటాల వెనక్కి
తోలి ఆ నాలుక చేసిన తప్పుకి తగిన దేహ శుద్ధి జరుగుతుంది. మజ్లిస్కి జగడపాటికి
హైదరాబాదులో వక్ఫ్ భూముల ద్వార ఉన్న చుట్టరికం లోకమంతా తెలుసును. హైదరాబాదులో
హిందూ ముస్లిముల మధ్య వైరాన్ని పెంచి తమ పెద్దరికాన్ని ఈ ప్రాంతం మీద తమ
పట్టుని నిలుపుకొనే ప్రయత్నం ఆంధ్ర ప్రదేశ్ అవతరించిన మరు క్షణం నుండే మొదలు
పెట్టిన ఆంధ్ర రాయలసీమ నాయకులు ఇక్కడ జరిగిన ఆస్తి, ప్రాణ, మాన నష్టాలకు
బాధ్యులు. కుసంస్కారుల కుటిలనీతులు ఈసారి తెలంగాణా ఉద్యమాన్ని తప్పు దోవ
పట్టించలేవని ఎప్పటికప్పుడు వారి కుటిలనీతులు బట్టబయలు చేయబదతావని వారి
వదరుబోతుదనం వారి కుసంస్కారం వారి నేర చరిత్రలు మీడియా ద్వార ప్రపంచం
గమనిస్తూనే ఉందని తమ పరిధులు తెలుసుకొని మాట్లాడడము ప్రవర్తించడము తమ
ఆరోగ్యానికి ఉనికికి మంచిదని తెలుసుకోండి, వలస రాజకీయవేత్తల ప్రభుత్వం తమను
అన్ని వేళల కపాడుతున్దనుకోవద్దు. జై తెలంగాణా వలస రాజకీయవేత్తల ప్రభుత్వం
బారినుండి తెలంగాణా విముక్తి మా ధ్యేయం. స్వతంత్ర తెలంగాణా రాష్ట్రం మా జన్మ
హక్కు.

Dear Telanganites,

One more time Andhra corporate lobby playing its crooked cards to divert the
telangana movement attention.

1) The flags all around the hyderbad on the eve of Milad-Un-nabi was
sponsored by Lagadapati through his third party channels. Every Masjid got
more than one lakh worth of flags and banners to fill the roads. The color
and design of the flags were same all around the city.

2) The same lobby distributed the flags and banners on Hanuman jayanthi. You
will find similar flags and banners all round the city.

3) The tension was created during the banners erection in old city. Already
Milad-Un-Nabi small flags were there all around the old city. When
organizers want to tie the hanuman Jayanthi flags over the already existing
banners tension was erupted. But an agreement was reached how to make the
arrangements for Hanuman jayanthi in front of MIM MLA’s and BJP leaders.

4) But suddenly in the midnight few miscreants removed the flags of Hanuman
Jayanthi in one area and also they removed Crescent flags in another area.
This created a breeding ground for further tensions.

5) We know what happened further. MIM party is banks upon money, even they
won’t bother welfare of Muslims, due to telangana movement so many muslim
sections are far away from the MIM.

6) To divert the telangana issue, and disturb the unification of Hindu and
Muslim forces in old city this plot was implemented.

7) Andhra lobby well knows that if old city agitates over telangana they may
not able to with stand in hyderbad.

8) When hindu-muslim riots were not there during 1948 razakar’s molestation,
why they were suddenly emerged after 1969 telangana movement.

9) Nizam used to pray the almighty that my people are so innocent, please
save these massom telangana people from clever and crooked Andhra people.

Let us spread this message and be united.

Sunday, March 28, 2010

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం


ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

జయ…

తరతరాల చరితగల తల్లీ నీరాజనం


తర…
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ జై జై తెలంగాణ

జై…
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ

గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ

కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప

గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్

జై…

జానపదా జనజీవన జావళీలు జాలువార

కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు

జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర

అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం
జై…
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం

అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం

సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద

సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద
జై…
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి

పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె

స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి

జై…

Saturday, March 27, 2010

జై ఆంధ్ర.ఒక ఆంధ్ర స్టూడెంట్ కామెంట్స్ ఆన్ తెలంగాణా

జై ఆంధ్ర.. జై.. జై..ఆంధ్ర.

ఆంద్ర ప్రదేశ్ విభజన వల్ల ఆంద్ర లో ఉన్న సామాన్యునికి ఏమి నష్టం?? అసలు ఏమి లాభం ?? ఈ ఆందోళన లతో ఎంత కాలం విభజన ని అడ్డుకొని .. ఏమి సాధిస్తాం?? విభజనికి ఇంక మనం మానసికం గా సిద్దం అవ్వవలసిందే..
విశాఖ నుండి రాజధాని వెళ్ళాలంటే ఒక రోజు ప్రయాణం.. సరైన వైద్యం కోసం రాజధాని.. అక్కడ చిత్కారాలు .. ఈ కర్మ మనకి అవసరమా? మనమూ ఉప్పు .. కారమే గా తింటున్నాం.. విడి పొతే మనకి మనం బతకలేమా? విజయవాడో.. విశాఖో.. రాజమండ్రి నో.. రాజధాని అయితే మనం అభివ్రుది చేసుకోలేమా? ఇక్కడ మనం కొంచెం విశాల హృదయం తో.. ఆలోచిస్తే.. అర్ధం అవుతుంది..
మాట్లాడితే హైదరాబాద్ పోతుంది అంటారు.. ఎక్కడికి పోతుంది.. పాకిస్తాన్ లో కలిసి పోతుందా? ? హైదరాబాద్ ..ఆంద్ర ప్రదేశ్ రాజధాని కాబట్టే అంత అభివృధి చెందినది.. రేపు ఇక్కడో రాజధాని ఏర్పడితే అదే స్థాయి అబివ్రుది ఖాయం.. .. సాఫ్ట్ వేర్ కంపనీలు అన్ని హైదరాబాద్ లో ఉంటే...ఏమైంది... రేపు మన రాజధానికి వస్తాయి.. మన వాళ్ళు బెంగళూరు.. చెన్నై వెళ్లి ఉద్యోగాలు చెయ్యడం లేదా? ఇదీ అంతే.. హైదరాబాద్ వెళ్లి చేస్తారు.. అసలు హైదారాబాద్ అనే ఫోభియా ఎందుకు అంటే అన్నింటికీ అదే రాజధాని అయ్యింది.. ఆ తప్పే కొంప ముంచింది. ఒక్క సాదారణ పరిపాలనకే రాజధానిగా ఉంటే ఇంత గొడవ ఉండేది కాదు.. సాఫ్ట్ వేర్ ఉద్యాగాలకి, సాంకేతిక విద్యకి ,, వైద్య విద్యకి. ,, వైద్యానికి., న్యాయానికి ,, పారిశ్రామికానికి ...ఇలా చెప్పుకుంటే అన్నింటికీ హైదరాబాద్ నే రాజధాని చేసి పాలకులు తప్పుచేసారు..
అదే తప్పు రేపు ఆంధ్ర ఏర్పడితే జరగకూడదు..
ఇంకా నీళ్ళు రావు అని గోల ... ఎందుకు రావు..? మనం ఎన్ని నీళ్ళు వృధాగా సముద్రం లోకి వదిలేయడం లేదు? ఎన్ని నీళ్ళని వాళ్ళు ఆపగలరు ? మనం తమిళనాడు కి నీళ్ళు వదలడం లేదా? ఇదీ అంతే..
విభజన కోరుకొనే వాళ్ళల సంగతి మనకెందుకు.. వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారో మనకెందుకు? విదిపోతాం అంటున్నప్పుడు విడిపోవడమే... ఇంతా కాలం బతిమిలాడి.. బెదిరించి కాపురం చేయిస్తాము? విదిపోదామనుకుంటున్న ఎవరికీ అయిన ఇదే వర్తిస్తుంది.. రాయల సీమ అయిన.. మన్య సీమ అయిన, ఉత్తర ఆంధ్ర అయినా ..రేపు ఇంకోటి ఏదైనా... .. దీనికోసం మన ఆస్తుల్ని మనం తగల పెట్టు కోవడం.. మన చదువుల్ని.. మన భవిష్యత్తు ని మనమే పాడు చేసుకోవడం అవసరమా?
సమైక్య ఆంద్ర అనేది అంతా కోట్లకు..కోట్లు పడగలెత్తి ... హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించిన వాళ్ళే...తప్ప సగటు మనిషి కాదు..అనేది అందరికి తెలిసిందే...
రేపు ఎలాగు శ్రీకృష్ణ కమిటి ఎలాగు తెలుస్తుంది.. ఆగండి.. చూస్తూనే ఉండండి,.
నేను పుట్టింది... పెరుగుతుంది... కోస్తా ఆంధ్ర లోనే... ఆయ్... అదేనండి.. రాజమండ్రి .. నుండి.. నాకు వీలనంత త్వరలో ఆంధ్ర రాష్ట్రము చూడాలని ఉంది.. అప్పుడు నేను నా రాజధానికి ....ఉదయాన్నే ఇంట్లో టీ తాగి... నా 180 CC బైక్ మీద రాజధాని వెళ్లి పని చూసుకొని... సాయంకాలానికి వీలుంటే మద్యాహ్నం బోజనానికి ఇంటికి వచేస్తాను..
నా వాదన ఇదీ ... నా వాదనలో తప్పు ఏమీ లేదు.. మీకు వేరే వాదన ఉంటే అదీ తప్పు కాదు.. ఎవరి వాదన వారిది.. చివరిగా వచ్చేది... జై ఆంధ్ర.. జై.. జై..ఆంధ్ర..
కామెంట్స్... తో.. నా ప్రాంతం వాళ్ళే నన్ను ఉతికేస్తారు అని తెలుసు... ఎంత కాలం ఉతుకు తారు... ?? ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకే కదా?? ఏమంటారు??
source: http://www.innervoice.co.cc/2010/03/blog-post_22.html

Friday, March 26, 2010

శవాల మీద లేస్తున్న జెండాలు

కాలుతున్న శవాలు, నేల
రాలుతున్న పరిమళాలు
పచ్చి మాంసపు వాసనలపై
ఎగురుతున్నాయ్ చూడు
సమైక్యాంద్ర జెండాలు !!

యువత ఆత్మహత్యలు, కాదు ఇవి
బడుగు జీవుల హత్యలు
ప్రత్యేక పోరు వెనుక
సాగుతున్నాయ్ చూడు
శవపు రాజకీయాలు !!

అభివృద్ధి మంత్రాలూ
అతికొద్ది పంపకాలు
అణగారిన జనాలపై
లేస్తున్నాయ్ చూడు
పెత్తందారి కోటలు !!

ఇలాత్కయలమ్మే ఇస్మయిలూ, మోర్లూడ్చే మల్లిగాడు
వీళ్ళ కోసమేనట నేటి ఈ సిత్రాలు
పేదరికం ముసుగు వెనక
చిందులేస్తున్నాయ్ చూడు
కోట్లకు పడగలెత్తిన తారలు !!

కలిసుంటే స్వర్ణయుగం, విడిపోదామంటే

మారుతుంది వర్ణం
వెర్రివాదనొకటి పైకిలేచి
బ్రమపెడుతోంది చూడు
నక్స లైటు భూతం !!

ఒక్కటవుతున్నాయి జిత్తుల నక్కలు
ఖాళీ అవుతున్నాయి ధనం మూటలు
ఇపుడు చచ్చిన శవాల పై సైతం
విరుగున్నాయ్ చూడు
ఖాకీల చేతిలో లాఠీలు !!!

ఓ .యు. విద్యార్థి గర్జన

ఓ .యు. విద్యార్థి గర్జన
ఓ యువరక్తపు ఘోషణ
రాజధాని నడిబొడ్డున
రగిలిన సంఘర్షణ

శతాబ్దాల గతమంతా
తిరగబడ్డ సోదరా ..
దశాబ్దాల కాలమంత
ధగాపడ్డ తమ్ముడా ..
వృధా కాదు నీ స్వేదం
యదార్థాల సాక్షిగా
యావత్ తెలంగాణా ఉంది
సదా నీకు తోడుగా ..

వాటాలు ఒకరికి
తూటాలు ఒకరికా?
మాటల్లో కోటలూ
చేతల్లో గోతులా ?
ఇక చాలు ఇక చాలు
బానిసపు బతుకులు
ఇకనైనా పీల్చనీయ్
స్వేచ్చా వాయువులు

కలిసొస్తే స్వాగతం
మా మనసులు సముద్రం
ఎదురొస్తే స్వేచ్చకు
విప్లవాల వీరులం

శ్రమ జీవులు, శ్రామికులూ
కర్షకులు కార్మికులూ
బడి పిల్లలు, మేధావులు
విడిపోతాం ఇకనైనా
సెలవంటూ చెపుతూంటే
వృద్ది అంటావ్, సమిష్టి అంటావ్
కలిసుండాలని శాసనం చేస్తావ్
ప్రజలంతా ఒకే మాటపై
నిలబడ్డారు అంటావేం
ప్రజలనే జాబితాలో
తెలంగాణ బిడ్డలను
ఇక నైనా చేర్చలేని
మాటలోని ఆ సత్యం
నీ చేతలోని ఔదార్యం
చూసి నిట్టూర్చే గదా
ఈ లోకం, నా ప్రాంతం
సమైక్యాంద్ర పదంలోనే
మతలబెందో అర్ధమాయే
తెలంగాణ కేక్కడిదిక నీ
నిఘంటువులో ఓ స్థానం

విడిపోయే వాన్నిగదా
ఓదార్చే అవసరం మరి
కలిసుండే వాని వెనుక
పడతారేం విడ్డూరం

నీది కాని గోచిపైన
ఎందుకింత కలకలం
పరాయి గడ్డమీద
ఏమిటింత పెత్తనం

ముళ్ళ మధ్య విరిసింది
అందమైన తామరం
తెలంగాణ గుండె రా
అది భాగ్యమైన నగరం

పువ్వు దోయ చూశావో
ఒళ్ళు గుల్ల తెలుసుకో మా
నవ్వు దోయ చూశావో
రేపు నీకు లేదుపో

నిజం ఉద్యమం, నివురు జర్నలిజం.......ఉస్మానియా విద్యార్థులు

ఉస్మానియా విద్యార్థులు - అందులో మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం అండతో పోలీసులు లాఠీచార్జ్ చేసి దారుణంగా హింసించారు. దీని వెనుక విద్యార్థుల తప్పులేదని ఇదంతా తెలంగానేతరుల కుట్రని తెలిసినా మీడియామాత్రం అంతగా స్పందించలేదు. ఇది కచ్చితంగా ప్రభుత్వం, పోలీసులు, మీడియా కలిసి పన్నిన కుట్ర. దీన్ని హైకోర్టు కూడా తప్పు పట్టింది  ..........

విశాల నిశీధి విలయతాండవం
వికార మానవ దురహంకారం
అనాది భారత యుగాల మడుగున
ఆరాధనతో ఆదిగకొలిచిన
మాతా, సోదరీ, యువతీ, దేవతా ..
నవీన భారత పునీత వనితా !


హక్కులకోసం పాకులాడితే ..
ఎదరొమ్ములపై పోలీసు బూటూ
పొత్తికడుపులో తుపాకిపోటు,
చెదిరిన జుట్టొక గుర్రపుకల్లెము
విద్యాలయమే నిలువెత్తు సాక్షము
నీ దేహమే తారురోడ్డుకు నేస్తము ..


చిమ్మ చీకట్లు సూర్యున్ని మింగేసినయ్ ..
నల్ల మబ్బులు చంద్రున్ని కమ్మేసినయ్ ..
వీదిదీపాలను డబ్బు చేతులు కప్పేసినయ్ ..
'ఆడ' పదాన్ని మహిళా సంఘాలు అమ్మేసినయ్ ..
మానవత్వాన్ని ప్రాంతీయతత్త్వం కొనేసింది !


లాఠీలు బాధ తాళలేక
                    ముక్కలుగా విరిగిపోయినయ్ !
రబ్బరు బుల్లెట్లు దారుణాన్ని చూడలేక సిగ్గుతో
                     యువత గుండెల్లో తల దాచుకున్నయ్ !!
అరుపులూ, కేకలూ, ఆక్రోశాలూ, ఆక్రందనలూ ..
రక్తాలూ, గాయాలూ, బాధలూ, వ్యధలూ ..
చిత్తు కాగితాలపై పిచ్చి భావాలయినయ్ !

హాస్టలురూము ఫ్యానూ, సెల్టవర్ అంచూ..
ఆడిటోరియం రూఫూ, బలిదానాలకు వేదికలయినయ్ !!

ద్రౌపది వ్యధనా? కీచక వధనా??
అంతులేని ప్రశ్నలరాత్రిని ' రోషం(?)' కమ్మేసింది
నిజం ఉద్యమం, నివురు జర్నలిజం..
నేనింకా బతికే ఉన్నానంటూ .
తెల్లవారగానే..ఉన్నత న్యాయస్థానం??

ఉద్యమం వర్ధిల్లాలి! తెలంగాణ సాధించాలి!!

దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రంకోసం చేస్తున్న పోరుకు ఫలితం, కలలు సాకారమయ్యే రోజులివి. తెలంగాణా రాష్ట్ర సాధనకోసం ప్రజలంతా ఉద్యమంలోకి దూకుతున్నారు. నాయకులు, పెట్టుబడిదారులు, కుల, మత చాందసవాదులు ఏ స్వార్థంకోసం తపిస్తున్నారో తెలియదు గానీ, సామాన్య ప్రజానీకం, యువత మాత్రం ఉద్యమాన్ని భుజాలనెత్తుకొని, పోలీసు లాఠీలకు, అధికారుల బెదిరింపులకు, తెలంగాణవ్యతిరేకుల ధనాశకు తలొగ్గకుండా, ధైర్యంతో ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా ఉద్యమిస్తున్నారు. ఏ పాపం ఎరుగని నిరుపేద యువతీ యువకులు కళ్ళముందుకొచ్చిన ప్రత్యేక రాష్ట్రం కొందరి అహంకార, అధికార, ధన బలం ముందు తలవంచుకు పోతుంటే, ఇక రాష్ట్రసాధన కలగానే మిగిలిపోతుందనే భయంతో, బాధతో దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఇక్కడ ఆలోచించాల్సింది, ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ప్రకటన చేసిన తర్వాత, మళ్ళీ వెనక్కి తీసుకోవడం వెనక దాగి ఉన్న కుట్ర గురించి, దానికి పాల్పడ్డ వాళ్ళకున్న బలం గురించి.
   తెలంగాణ వ్యతిరేక పెట్టుబడుదారులు , రాజకీయ నాయకులకు కేంద్రం తలొగ్గింది. వీరికి అంత బలం ఎవరిచ్చారు? అది ఇక్కడి ప్రజలే.. ఇది నిజం. ప్రస్తుత రాజకీయ ప్రభావాలను తట్టుకుని ప్రభుత్వాలు నిలవాలంటే ఆర్ధికంగా పార్టీలు బలంగా ఉండాలి. కారణం ఏదైనా మన రాష్ట్రంలో ఆర్ధికంగా బలంగా ఉన్నది సీమాంద్ర ప్రాంతానికి చెందినవారే. కాని వారి వ్యాపార వృద్ధికి తోడ్పడ్తుంది మాత్రం తెలంగాణ ప్రజలే. ఆంద్ర, రాయలసీమలు రెండూ పెట్టుబడులలో ఒకదానితో ఒకటి  పోటీపడుతున్నై. వారికున్న ప్రాంతీయ అభిమానంతో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో గట్టిపోటీ ఉంటుంది. అందుకే వారి వ్యాపారాలు అక్కడ తొందరగా వృద్ధిచెందవు. తెలంగాణ ప్రాంతం మాత్రం వీరి ఉత్పత్తులను ప్రాంతాలకతీతంగా వినియోగిస్తారు. ఇక్కడి ప్రాంత ప్రజలు వ్యాపారాల్లో పోషించే పాత్ర తక్కువ కావడంవల్ల అధిక లాభాలనార్జించే అన్ని రంగాల్లో సీమాంద్ర పెట్టుబడిదారులే కనిపిస్తారు.
  అంటే ఒకవైపు తెలంగాణా ప్రజల సంపదతో వ్యాపారం చేస్తూ, అదే సంపదతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఆలోచిస్తే తెలంగాణ ప్రజలే తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్లు. అలాంటప్పుడు ఎన్ని ఉద్యమాలు వచ్చినా పెద్దప్రయోజనం ఏమీ ఉండదు. ఏ ఉద్యమమయినా  ఫలితాలను పొందాలంటే, ఉద్యమం ఎక్కువకాలం నిలబడాలి. ఉద్యమ విధి విధానాలు, ఆశయాలూ, లక్షాలూ సామాన్యుడిని చేరాలి. నేటి పరిస్తితుల్లో ఎలాంటి విషయమైన చిటికెలో ప్రపంచమంతా వ్యాప్తి  చెందించే మాద్యమం TV చానల్స్ మాత్రమే. మరి తెలంగాణ ఉద్యమాన్ని సద్భావంతో, సదుద్దేశ్యంతో సూటిగా లక్ష్యం వైపు గురిపెట్టగలిగే రీతిలో చూపించే ఏ ఒక్క ఛానల్ అయినా ఉందా అంటే అది అంతుదొరకని ప్రశ్నే. ఒకవేల ఉన్నా వాటికున్న ఆదరణ అంతంతమాత్రమే. ఒక విషయం మంచిదా, చెడ్డదా అని నిర్ణయించేది, పదిమందీ దాని గురించి ప్రస్తావించడం వల్లే. ఈ నగర జీవితంలో ఆ పదిమందీ తనే అయి పోషిస్తున్నాయి T V చానల్స్. అందుకే ఒక్క రోజులో తివారి విటుడయ్యాడు, రాజశేఖర్ రెడ్డి దేవుడయ్యాడు. ఇదంతా మీడియా సృష్టి కాదా?
 తెలంగాణాలోని ప్రతి పల్లె అగ్నిగుండంలా ఉంది. రేపటి తరానికి దిశా నిర్దేశాలు సూచించే యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం, పోలీసులు మానవత్వం మరిచి యువతీ యువకులను దారుణంగా హింసిస్తున్నారు. ఇన్ని జరిగినా ఏ టి.వి ఛానల్లో కూడా వీటికి సరైనస్తానం  దొరకకపోవడం బాదాకరం. చాలా సందర్బాలలో తెలంగాణ ప్రజల మద్య విబేదాలు పెంచే రకంగా ప్రోగ్రామ్స్ వస్తున్నాయ్ తప్ప ఇది న్యాయమైన పోరాటం అని చెప్పే టి.వి చానల్స్ కరువయ్యాయ్. ఉద్యమం నిలబడాలంటే ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని గాయాలపాలవడం, చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. ఈ ఉద్యమం ఓ పోరు. ఈ పోరులో నెగ్గాలంటే వ్యతిరేక శక్తులను బలహీన పరచాలి. ఇక్కడ వ్యతిరేకతకు ఉన్న బలం డబ్బు, అధికారం. ఆర్తికంగా బలహీనమైతే రాజకీయంగా ఎదగడం కష్టం. అందుకే సీమాంద్ర వస్తు, వ్యాపార, సేవలను బహిష్కరించాలి. అందులో బాగంగా అన్నిటికంటే ముందుగా చేయాల్సింది ఉద్యమాన్ని వక్రీకరించి, నీరుగార్చే టి.వి చానల్స్ ని ఆదరించక పోవడం లేదా వాటిని పూర్తిగా తొలగించడం. దీంతో ముందుగా యువత బలిదానాలు ఆగిపోతాయి. ప్రజలకు నిజాలు తెలవకపోయినా అబద్ధాలకు, అభూతాలకు తావుండదు. ఎప్పుడూ ఎదుటివాడిని వేలెత్తి చూపే చానల్స్ T.R.P(Target Rating Point)  లు పడిపోయి ఇక ముందైనా నిజాలను చూపించే ప్రయత్నాలు చేస్తాయి. ఆకలి కేకలకూ, కన్నీటి వ్యధలకూ గుర్తింపు దక్కుతుంది. ఉద్యమాలు వర్ధిల్లుతాయి. 


ఉద్యమం వర్ధిల్లాలి! తెలంగాణ సాధించాలి!!

విడాకులు మంజూరు చేయండి

విడాకులు మంజూరు చేయండి


అందరం మొగుళ్ళం కలిసే ఉందాము అంటారు

భార్యనైనా బలవంతంగా అనుభవిస్తే అత్యాచారమనే అంటారు

విడాకులు మంజూరు చేసి , విడి ఆకులుగా తెలుగు వృక్షంలో మెలుగుదామనే కోరిక

రాజ్యంగం పట్ల తెలంగాణ ప్రజలకు ఉన్న గౌరవానికి సూచిక

ఒకడు తల్లిని చీల్చుతున్నాము అంటాడు

ఇంకోకడు వస్త్రాపహరణం అంటాడు

వాడు ఏమి చేయాలని భావించాడో అదంతా ఎదుటివానిపై రుద్దుతాడు

వివేకంతో విడిపోవాలి అనుకునే వాళ్ళకి ఇన్ని నిందలా

సమైఖ్య ఆంధ్ర నినాదం , మారింది సున్నిత తెలంగాణ వారికి ఊపిరాడని బొందలా

ఊపిరి ఆడని వాడికి శాంతి వచనాలు వినపడవు

విరుచుకు పడతాడు, విప్లవిస్తాడు , బంధాలు బంధుత్వాలు వాడికి అగుపడవు

వాడికి తెలంగాణా యే శాంతి తెలంగాణాయే సర్వం

నీవు నిజంగా అదే కోరితే వాడితో సహకరించు లేదంటే తప్పదు యుధ్ధ పర్వం

తటస్థ పరమాణువుతో తాడనం చెందిస్తే ఎమవుతుంది .... విస్ఫోఠనం

అవస్థ అర్థం చేసుకోకుండా అనవసర సలహాలిస్తే ఆగదు ప్రతిఘటనం

జయ జయహే తెలంగాణ ... జననీ మా తెలంగాణ

తెలంగాణా ఇ మాట లోనే ఓ దీరత్వం..

ఓ సూరత్వం.. ఇంచు ఇంచు కి ఓ పోరు బిడ్డ

గడప గడప కు ఓ వీరనారి

ఈ మట్టి లోనే ఏదో తెలియని భావోద్వేగం

ఉహకంధని ఉధ్యమాలు....

నెలకొరిగి నింగికేగీసిన తారలెందరో !

పోరు బాట లో కదమ్ తొక్కిన పులిబిడ్డ లెందరో !!



అమరులైన బిడ్దలను గుండెకద్దుకుని

కన్నీళ్లతో జోహార్లర్పించిన పల్ళేలెన్నో..

ప్రతి రోజు బతుకు కొరకు పోరు చేస్తూ

పోరాటమే మా బతుకు అంటరు

ఉద్యమాలే మా ఆతుకుల బతుకులకు

మెతుకులు అంటరు



ఏ గుండె ను కదిలించిన క"న్నిటి"గాథలే

ఏ పల్లె ను విప్పిన ఉద్యమాల చరిత్రలే

ఉరూర కొమురంబీమ్ లు ఉంటరూ

వాడ వాడ న వీరులు ఉంటరూ

కొంగు నడుముకు చుట్టి

పిడికిలీ బిగించి గర్జించే

వీర నారీ మణులు ఉంటరూ

ఉద్యమాల ఉరుములో

బిడ్డల ను త్యాగం చేసే తల్లులు ఉంటరూ



డప్పుల్లో దరువెస్తు కాళ్లకు గజ్జెలు కట్టి

జాజ్జనకర జానరె అనే కళాకారులు

ప్రతి మట్టి ఇంట్లో ఉంటరూ

వారికి దన్నుగా కళా పోషకులు ఉంటరూ

నా తల్లి బారతాన సుగంధ సువాసానలున్న నా తెలంగాణా

విశ్వ సర్వస్వం న రతనాల వీణ

నా బాష, నా యాస ఓ స్వచ్ఛమైన శ్వాష

నా శ్వాష, నా ప్రాణం నా సుంధర తెలంగాణా !!!

జై తెలంగాణా !!

గాయ పడ్డ తెలంగాణా గర్జించ క మన ధు

గాయ పడ్డ తెలంగాణా


గర్జించ క మన ధు

ధగా పడ్డ తెలంగాణా

వీర విప్లవ్ తెలంగాణా

తీరుగబడక మానధు

స్వాతంత్రం రా ని తెలంగాణా

స్వాతంత్రం లేని తెలంగాణా

ోరాడక మానధు

ఇప్పుడు మాకు మిగిలింధీ

అవమానాలు--ఆసమానతలు

అక్రోషాలు--జారే కన్నీళ్ళు

పొగలు--సెగ లు--గాయాలు

గాయమయినా బ్రతుకులు

బితుకు బితుకు జీ వి తా లు

నేడు --మా పల్లెల్లో జనాలు

గూడు లేని గువ్వాలు

తోడు లేని అవ్వ లు

తాదులేని బొంగరాల జీ వి తా లు

దారం తెగిన గాలిపటం లా మనసుల1



న్నినటిధా క --తెలంగాణా

ఒక రాజకీయ యాపార వస్తువు

అధికార సొపానానికి ఉపయోగపడే

ఒక ని నా ధ ము

చేతకాని--చేవ లేని

నేత రాజ్యం లో

చూస్తూ న్న ధీ

కొత్త ప్రామిసులు-

కొత్త మోసాలు

కొత్త ఎత్తులు--కొత్త జిత్తులు

పై స ల గల గల

కులం జల జల ల తో

అగ్రకులాల మధ్య ఆట (గేమ్ )

ఇది మన ప్రజాసామ్యం ????



కావాలని కయ్యానికి దూరకు

సె సె కీడు సె సె సు కుంట

దొంగ క మే టి లు--కాలయాపనలు

ఊలన్గనలు--యొప్పందాలు కాలరాయడం

ఓంకరి --టిం క రీ వ గ ల మాటలు

ఇక వద్ధు

ఇక ఊకోం

ఇక ఈనేధీ--గనేధీ లెధు

నమ్మకం ఆవిరి అయిపోయింధీ



బ్రతికి ఉన్నంత కాలం

కాకతీయ తో ర నం సాచిగా

వేయి స్టంబాల గుడి మీ ధ ఓ ట్టూ

ఇసాబ్ కోసం

మేము తీరుగబడక మానం

గుర్తుంచుకో

నిజాం నవాబ్ ను గద్దె దిప్పింధీ మేమే

జమీందార్ల ---జాగిర్దార్ల

చరమ గీతం పాడి న ధీ మేమే



ప్రజలంతా సంగ టీకా శక్తి గా మారడం కాయం

జై తెలంగాణా సునామీ రానుంధీ

ఉద్యమం మా ఊపిరి

అన్ని హంగులతో

అన్ని సంగాలు ఒక్కటి అయి

ఒకే మాట--ఒకే పా ట పాడుతూ కొత్త రకం ఉద్యమం చేపడుతాం

తెలంగాణా సాదించి తీరుతాం

ఇది ఆచ్చరాల స త్తేం

ఆగులు -బు గు లు మాటలు కావు

కొత్త చరిత్ర రాసి సూపెడుతాం

రేపటి విజయం మాదే

అదొక్కటే మా తోవ్వ

జై తెలంగాణా --మా చివరి గమ్య

అమరుడిన యాదన్న కన్నీటి గాథ

అమరుడిన యాదన్న కన్నీటి గాథ

అతడొక అమరవీరుడు అంటారు కొందరు..


కాదు పిరికి వాడంటారు ఇంకొందరు..

అదొక తొందరపాటు చర్యంటారు కొందరు..

నేను సైతం రేగుతున్న విప్లవానికి సమిధనొక్కటి ఆహుతినిచ్చాను అంటాడు అతడు..

అమ్మా లేదు, నాన్న లేడు, వాడు చస్తె ఎంత అన్నట్టు ఆంధ్ర నాయకులు..
ఎవరన్నారు..4 కోట్ల బందువులున్నం యాదయ్యని యాదికి తెచ్చుకోనికి..

మేనమామ అన్నడు ఈడ్నే పంజూస్కో కొడుకా అని..ఇదే నా పనన్నడు..
ఇందుకోసమే నేను పుట్టిన అన్నడు..

ఎవరేం చెప్తె అది నమ్మిండు..

చిరంజీవి చెప్పిండు జై తెలంగాణ అని..

యాదయ్య జై చిరంజీవి అన్నడు..

చంద్ర బాబు చెప్పిండు జై తెలంగాణ అని..

తమ్ముడు జై చంద్ర బాబు అన్నడు..

అమరుడైన తెలంగాణ బిడ్డ ఇంద్రన్న ఆశయాల సాధనకోసం పంచేస్త అన్నది సబితమ్మ..తమూడు జై సబితమ్మ అన్నడు..

చివరుకు యాదన్న కలల సాకారం తెలంగాణాచ్చింది..

యాదన్న దండం పెట్టిండు… మీరంత నా దేవుల్లన్నడు

---------------------------------------------------------------

కని ఇంటి గుమ్మంలనే చిరంజీవి చెప్పుదెబ్బ కొట్టి పంపిండు ..

తెలంగానేందిరా నీ అబ్బ సొత్తా అని..

చంద్ర బాబు దగ్గరికి పొయిండు..

యే లే ఉత్తగనే అన్న కని ప్రబుత్వం గిట్ల తెలంగాణ ఇస్తదని అనుకోలె..

మనం సమిష్టి పంచేసి స్వర్నాంధ్ర చెయ్యాలె గని తెలంగానేంది తమ్మి అన్నడు..

నాలుగు వాతలు పెట్టి పంపిండు..

సబితమ్మ దగ్గరుకు పొయిండు కొండంత ఆశతోని..

తమ్ముడూ ఇగో నా చేతిల యేం లేదు..

ఆల్లెంత చెప్తె నేను గంతే..

ఇంతల పోలీసొడొకడచ్చి తెలంగాణ పేరెత్తంగనే యాదన్నని కుల్లబొడుసుడు మొదలుపెట్టె..ఒక్కడ్ని చేసి పోరన్ని కుక్కలెక్క కొట్టి రబ్బరు బుల్లెట్ల తోని కాల్షిండ్లు..

సబితమ్మ మొత్తం చూశి అరె ఎంత పనైపాయె..

పాపం గట్ల కొట్టకున్లి పోరన్ని అని కూడ అన్లే..

మొత్తం కొట్టుడయినంక సారీ చెప్పున్లి పపం దెబ్బల్ తిన్నడు బాగ అంటె

పోలిసోల్లకి జరంత ద్యాసచ్చి సారి చెప్పి పంపిన్లు..

ఫోన్ తీషిండు యాదన్న..

ఎవరికన్న చేద్దామని..

అమ్మా, నాన్నల్లేని అనాధ..

తెలంగాణె తల్లై, పోరాటమె తండ్రై బతుకుతున్న ఓ అమాయక విద్యార్థి..

ఎమ్మెల్యేలకు ఫోన్ కొత్తి అడిగిండు..

అన్నా గిట్లైంది..మీరు రాజినామ చేషి నిరసన చెయ్యాలె..

అరె జరంత ఉండు తమ్మి …

మనం పవర్ల ఉంటెనే ఎమన్న చేస్తం అని కట్ చేసిండు ఎమ్మేల్యే సాబ్..

----------------------------------------------------------------

ఫోన్ల సిం కార్డు తీశి ఔతల పడేషిండు యాదన్న..

గా దేవుల్లందరితోని దిగిన ఫోటొలు సంచిల పెట్టుకున్నడు…
ఎవరన్న కనిపిస్తె అడుగుదాం నేనేం తప్పు చేశిన గిట్ల శిక్షిస్తున్లు నన్ను అని..

ఎవ్వరు దొరకలే..

దెబ్బలాగుతలేవు..

బొబ్బలు తగ్గుతలెవ్వు…

తిన్న దెబ్బల గాయాలు, వాతల బాధలు సలుపుతున్నయ్..

పోరడు అస్తిత్వం కోసం బయలు దేరిండు..

తెలంగాణ ఎవ్వరు తెస్తేంది తేకుంటేంది అని

ఒంటరిగ బయలు దేరిండు..

వీధి వీధి వాడ వాడ వాడే..

ఉస్మానియా లాటీ చార్జిల వాడె..

గర్జనల్ల వాడె..

ఉప్పెనై, పెను తుఫానై వాడె..

ఎక్కడ సూషిన వాడె..

వాడు రగిలించిన విప్లవం రాష్త్రమంత అలజడి రేపింది…

సుడిగాలిలా మారి వడగాలిని రేపుతుంది..

రాజకీయ సంక్షోభం యేర్పడ్డది..

వానికి తోడుగ వేల గొంతుకలు..

అనాధని ఎవరన్నరు…

మతిలేనోడె అంటడామాట…

సమైక్య ప్రపంచం దద్దరిల్లింది..

అతలకుతలమయ్యింది..

పక్క దారిన దొంగ మాటు వేసింది వాడి హ్రుదయం మీద..

వాడి మనసులొ అలజడి రేపింది..

మానసిక సంక్షోభాన్ని లేపింది..

వాడిని నిలువునా తగులబెట్టింది..

ఆ మంటల్ల కాలుతున్న తెలంగాణ ఆత్మాభిమాన ఆర్తనాదాన్ని చూసి వికట్టట్టహాసం

చేసింది..కొన్ని ప్రష్నలు..

ఇంతకీ యాదన్న మనిషేనా..

లేదంటె తెలంగాణ అస్తిత్వం మానవ రూపం దాల్చిందా..

లేదంటె ఆ మంటల్ల మా దైన్యం, నిస్సాహయతని ఎత్తి చూపుతుందా..

లేదంటె తనకు సాయం రాని సంఘం అసమానతలని తట్టి లేపుతుందా..

లేదంటె కలుతున్నది స్సమానత్వ అప్రజాస్వామ్యమా..

లేదంటె గాయపడ్డ తెలంగాణ తల్లి నిత్యక్షోభ ఆర్తనాదమా..

లేదంటె దగాపడ్డ నా ప్రజల ఓటమా..

ఇంతకీ యాదన్నని సంపిందెవరు???



----------------------------------------------------

ఏమో మరి..

ఇన్ని ప్రష్నలకి సమాధానం దొరకక సతమతమవుతుంటె..

పిరికి చర్య అంటడేందో మరి చంద్ర బాబు..

ఎమో మరి..మీకే తెల్వాలె..

జగమెరిగిన జగన్నాటక సూత్ర ధారులు…

నీటముంచినా, నిలువునా కాల్చినా

మీ మాటే మా వేద మంత్రం..

మీ సమైక్యతా, అభివ్రుద్దే మా అంతిమ ధ్యేయం..

మీ కాలి కింద చెప్పులం..

నాలుగు కోట్ల అనాధలం..

సీమాంధ్రప్రదేష్ సమైక్యాంధ్ర సాక్షిగా

వెయ్యి కాలాలు బాగుండాలె..

మీరు, మీ పిల్లలు అందరూ సల్లగ ఉండాలె..

మీ పొలాల్ల మా నీల్లు కలకాలం పారాలె..

మీరందరు మా జాగల్ల సుఖం గ ఉండాలె..

మీ పోరగాల్లందరికి ...

కవిత-తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా?

తెలంగాణ వేరైతే



దేశానికి ఆపత్తా?


తెలంగాణ వేరైతే


తెలుగుబాస మరుస్తారా?


తెలంగాణ వేరైతే


కిలోగ్రాము మారుతుందా?


తెలంగాణ వేరైతే


తెలివి తగ్గిపొతుందా?

తెలంగాణ వేరైతే


చెలిమి తుట్టి పడుతుందా?


తెలంగాణ వేరైతే


చెలిమి లెండిపొతాయా?


కులము తగ్గిపొతుందా


బలము సన్నగిలుతుందా


పండించి వరికర్రల


గింజ రాలనంటుందా?


రూపాయికి పైసాలు


నూరు కాకపొతాయా?


కొర్టు అమలు అధికారము


ఐ.పి.సి. మారుతుందా?


పాకాల, లఖ్నవరం


పారుదలలు ఆగుతాయా?


గండిపేటకేమైనా


గండితుటు పడుతుందా?


ప్రాజెక్టులు కట్టుకున్న


నీరు ఆగనంటుందా?


పొచంపాడు వెలసి కూడ


పొలము లెండిపొతాయా?


తెలంగాణ వేరైతే


దేశానికి ఆపత్తా?






–కాళోజీ

Wednesday, March 24, 2010

తెలంగాణా-- నాలుగు కోట్ల ప్రజల జన్మ హక్కు

నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల జన్మ హక్కు

మా కృష్ణ గోదావరి నీళ్ళు మాకు కావాలె

మా భూములు మాకు కావాలె

మా బొగ్గు తోని తాయారు అయిన

విద్యుత్తు మాకు కావలె

మా కొలువులు మాకు కావలె

మా తాతల చెమట  నెత్తురు తోని కట్టిన

హైదరాబాద్ మాకు కావాలె

పొట్ట చేత పట్టుకొని

వొచ్చినోని తోని మాకు బాధ లేదు,

 దోచుకొను వచ్చినోన్ని తెలంగాణా పొలిమేరలకు

తరిమి కొడుతం

సిపాయి తిరుగుబాటు విఫలమయ్యింది అని ఆగిందా భారత

స్వతంత్ర సంగ్రామం

ఒక తరం వోరిగిపోతే ఇంకొక తరం అందుకోలేద పోరాట పందాను

నిజాం దోపిడి రజాకార్ ల దౌర్జన్యం పోయింది
అని ఆగిందా తెలంగాణా కోరిక ఆంధ్ర

దొరల దోపిడీకి తుపాకి దెబ్బలకు వోరగాలేద తెలంగాణా అమరవీరులు

తెలంగాణా  స్వయం పాలన కోరిక తరం తరం నిరంతరం ఎగసిపడే ఉప్పెన

జై తెలంగాణా....

Wednesday, March 3, 2010

Telangana Kavitha

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?

తెలంగాణ వేరైతే
కిలోగ్రాము మారుతుందా?
తెలంగాణ వేరైతే
తెలివి తగ్గిపొతుందా?

తెలంగాణ వేరైతే
చెలిమి తుట్టి పడుతుందా?
తెలంగాణ వేరైతే
చెలిమి లెండిపొతాయా?

కులము తగ్గిపొతుందా
బలము సన్నగిలుతుందా
పండించి వరికర్రల
గింజ రాలనంటుందా?

రూపాయికి పైసాలు
నూరు కాకపొతాయా?
కొర్టు అమలు అధికారము
ఐ.పి.సి. మారుతుందా?

పాకాల, లఖ్నవరం
పారుదలలు ఆగుతాయా?
గండిపేటకేమైనా
గండితుటు పడుతుందా?

ప్రాజెక్టులు కట్టుకున్న
నీరు ఆగనంటుందా?
పొచంపాడు వెలసి కూడ
పొలము లెండిపొతాయా?

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?

–కాళోజీ

Tuesday, March 2, 2010

విభజిస్తే తప్పేంటి?

రాష్ట్ర మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ వెలిబుచ్చిన అభిప్రాయం సమైఖ్యవాదుల్లోకూడా సానుకూల చర్చకు
అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఏం.ఎల్,ఏ, శ్రీ వసంత నాగేశ్వర్ రావు, ఎం.పి.హర్షకుమార్, హరిరామ జోగయ్య, సీనియర్ జనరలిస్ట్ పొత్తూరి నాగేశ్వర్ రావులాంటి వారు ఇలాంటి అభిప్రాయాలనే పలుసందర్భాలలో వెల్లడించారు. వీరంతా లోతుగా విశ్లేషించి అణు నిత్యం కలతలతో కూడిన కాపురం కొనసాగదని, ఏ రకంగా ఆలోచించినా భవిష్యత్
పరిణామాలు తీవ్రంగా వుంటాయని, తెలుగు రాష్ట్రాలు రెండు వుంటేనే ఇరు ప్రాంతాలు మరింత అభివృద్ధి
చెందుతాయని, కాదూ కూడదన్నా ఇలాగే కలిసివుంటామంటే సీమాంధ్రుల ఆత్మగౌరవంకూడా దెబ్బతింటోందని,
మరింత మనసులు విరుగకముందే అన్నదమ్ముల్లా విడిపోవడం అందరికీ మంచిదని హితవు పలికారు.
ఇప్పుడు రాష్ట్రమంత్రి హోదాలోవుండి కూడా నిజాయితీగా, నిష్కర్షగా తన అభిప్రాయాన్ని వెల్లడించడం సర్వదా హర్షణీయం, ఆమోదయోగ్యం.కానీ బొత్సాపై క్రమశిక్షణాచర్య తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కొందరు సమైఖ్యవాదులు
ఫిర్యాదు చెయ్యాలనుకుంటే, మరి ఆ అధిష్టానమే "కంచే చేనుమేసినప్పుడు" దానికున్న నైతికబలం ఏపాటిది? ఉదాహరణకు నీటి మూటల్ని తలపించే కాంగ్రెస్ పెద్దల మాటలు గమనిద్దాం:
1) ఆంధ్ర ప్రదేశ్ అవతరణ సందర్బంలోనే ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు వెలిబుచ్చిన
ప్రమాదసూచికల్ని ఆయన వారసులు / కాంగ్రెస్ పార్టీ నేతలు పాటించకపోవడం ఆయన మనోభావాల్ని అగౌరవపరచినట్లు కాదా?
"एक मासूम लडकी को एक नतूकत लड़का से शादी किया गया, चलेतो चले,
अगर नचलेतो कबीबि तलाक" - जवहरलाल नेहरूजी
ఏనాడో అన్నమాటలు ఊరికే అన్నట్లా? వచ్చే కలతల్ని, జరిగే అవకతవకల్ని ఆనాడే పసిగట్టి హెచ్చరించడం
విస్మరించరానిది కాదా? అనగా...
"ఒక అమాయకపు అమ్మాయికి గడసరి అబ్బాయితో పెళ్లి జరిగింది, కలిసివుంటే సరే,
లేకుంటే విడాకులే"- నెహ్రూజీ


ఇంగ్లీష్ లో.. * “The Andhra and Telangana merger is like marrying an
innocent bride*


*to a naughty husband. If it goes well let it could be as is, but if it
doesn’t they can get*

*divorced at any moment”*- Jawaharlal Nehru

* ["It is like a matrimonial alliance having provision of
divorcé, if you wish not to continue with it"]*

2) Sonia and her Congress party are very well aware of the fact that
they won the majority of seats in AP and was able to form governments in
state and center just because of Telangana issue - yet in a typical
Congress's age old "politics of convenience and betrayals" - they managed to put the demand and wish of 3.5 crores of Telangana people in storage for the past 3 and half years.

3) Prime Minister Manmohan Sigh says that :

*“The common minimum program is already spells out under what we
need to do*

* in this regard, we need to consult all concerned, and other
proper consultations *

* we are committed to establishment of Telangana...”*

4) Former President Abdul Kalam in his presidential address says that:

*“The Govt will consider demand for formation of Telangana state
at an appropriate*

* time for due consultation.”*

5) కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అలా హామీలివ్వడమేగాక ఆంధ్ర-హైదరాబాద్ ఇరు
రాష్ట్రాలను విలీనం చేసి

షరతులతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణను కాంగ్రెస్ పెద్దలు జేసుకొని
అన్నింటినీ

ఉల్లంఘించింది నిజం కాదా? ఈ అర శతాబ్ది పైగా జరిగిన సమైఖ్య
రాష్ట్రపాలనలో ఏనాడైనా

సవ్యంగా,ఎలాంటి వివక్ష లేకుండా జరిగిందా? ఇక ఇప్పుడు నిజాయితీగా
మాట్లేడేవారు దోషులా?


లేక స్వార్థ రాజకీయాలతో ఎప్పటికప్పుడు మభ్యపెడుతూ నయవంచనజేసేవారు
దోషులా?


ఎవరు శిక్షార్హులు? కాలమే నిర్ణయిస్తుంది..


కోస్తాంధ్రకు చెందిన *బొత్సా** **సత్యనారాయణ* కాబోయే ప్రత్యేక
ఆంధ్రరాష్ట్రానికి సీ.ఎం.కావాలనే ఈ యాగీని


చేస్తున్నారన్న కువిమర్శలు కట్టిపెట్టాలి. ఇంత జరిగాక ఇంకా కలిసి ఉండగలమా?
కోర్టులు,వ్యాపార-విద్యా


సంస్థలు, నిఘా-భద్రతా వ్యవస్థలు అన్నీ నిట్టనిలువునా ఇప్పటికే చీలిపోవడమైంది.
పిల్లల ప్రశ్నాపత్రాల


దిద్దడంకూడా వేర్వేరుగాఉండాలనే వాదనలు వచ్చినాక, ఉద్యోగ వర్గాల్లో వైషమ్యాలు
పెరిగినాక ఇంకా


ఎలా కలిసివుండగలం? సోదర భావంతో ఎవరికివారు కలతలు లేకుండా, ఎవరి రాష్ట్రంలో వారు
గౌరవంగా


ఉందామని స్వాగతిద్దాం. నెహ్రూజీ మాటల్ని గౌరవిద్దాం.


జై తెలంగాణా! జై జై తెలంగాణా!!

Link From www.yuvatelangana.com