నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల జన్మ హక్కు
మా కృష్ణ గోదావరి నీళ్ళు మాకు కావాలె
మా భూములు మాకు కావాలె
మా బొగ్గు తోని తాయారు అయిన
విద్యుత్తు మాకు కావలె
మా కొలువులు మాకు కావలె
మా తాతల చెమట నెత్తురు తోని కట్టిన
హైదరాబాద్ మాకు కావాలె
పొట్ట చేత పట్టుకొని
వొచ్చినోని తోని మాకు బాధ లేదు,
దోచుకొను వచ్చినోన్ని తెలంగాణా పొలిమేరలకు
తరిమి కొడుతం
సిపాయి తిరుగుబాటు విఫలమయ్యింది అని ఆగిందా భారత
స్వతంత్ర సంగ్రామం
ఒక తరం వోరిగిపోతే ఇంకొక తరం అందుకోలేద పోరాట పందాను
నిజాం దోపిడి రజాకార్ ల దౌర్జన్యం పోయింది
అని ఆగిందా తెలంగాణా కోరిక ఆంధ్ర
దొరల దోపిడీకి తుపాకి దెబ్బలకు వోరగాలేద తెలంగాణా అమరవీరులు
తెలంగాణా స్వయం పాలన కోరిక తరం తరం నిరంతరం ఎగసిపడే ఉప్పెన
జై తెలంగాణా....