Telangana Forums is an independent Telangana Friends online community which fights for the seperate statehood of Telangana. Now it is a historical time for all the Teleangana students, employees, writers, teachers, professionals, and Intellectuals to unite for the Telangana Movement
Thursday, September 23, 2010
కేసీఆర్ వ్యాఖ్యలతో ఉద్యమానికి నష్టమే !: తెలంగాణ జేఏసీ
హైదరాబాద్, సెప్టెంబర్ 21 : స్థానికతపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉద్యమానికి నష్టమేనని తెలంగాణ జేఏసీ భావిస్తోంది. మంగళవారం ఇక్కడ తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జేఏసీ భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు..ఏ దశలోనూ కేసీఆర్ వ్యాఖ్యలను అంగీకరించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..తెలంగాణ ఉద్యమానికే కాకుండా, ఇక్కడి ప్రజలకు కేసీఆర్ వ్యాఖ్యల వల్ల నష్టం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనకు తెలియజెప్పాలని నిర్ణయించారు.
ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారు పూర్తి సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని, ఉద్యమకారుల మనసు నొప్పించే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని అభిప్రాయపడ్డారు. స్థానికులు ఎవరు ? స్థానికేతరులు ఎవరు ? అనే విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించాలని అభిప్రాయపడ్డారు. ముల్కీ నిబంధనల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తీర్మానించారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలు తరహా పరిణామాలు చోటుచేసుకున్న సందర్భంలో తెలంగాణ వాదులు పరస్పరం విమర్శలకు దిగవద్దని భావించారు.
ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులపై వేధింపులను ప్రభుత్వం ఆపకపోతే క్షేత్ర స్థాయి నుంచి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, జేఏసీ నేత వి.శ్రీనివాస్‌గౌడ్‌కు అందిన బదిలీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని కోరుతూ సీఎం రోశయ్యను కలవాలని, అయినప్పటికీ ప్రయోజనం లేకపోతే తదుపరి కార్యాచరణ చేపట్టాలని తీర్మానించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇవ్వనున్న నివేదికపై (అనుకూలమైనా..వ్యతిరేకమైనా) తెలంగాణ జేఏసీకి ఒక ముందస్తు ప్రణాళిక ఉండాలని నిర్ణయించారు.
దీనిపై వీలైనంత త్వరగా కసరత్తు చేపట్టాలనుకున్నారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ జరిగిన ఈ సమావేశానికి టీఆర్ఎస్‌సహా బీజేపీ ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు. జేఏసీ భాగస్వామిగా మూడు రాజకీయ పార్టీలుంటే..ఒక్క న్యూడెమోక్రసీ నుంచి కె.గోవర్థన్ హాజరయ్యారు. ఇతర భాగస్వామ్య ఉద్యోగ, ప్రజా సంఘాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు.

తెలంగాణా వస్తుందనుకుంటే పగటికలే అంటున్న బాబు-ఆలూ లేదు, చూలూ లేదని సామెత గుర్తు చేసిన బాబు

2011 తెలంగాణా వస్తుందనుకుంటే పగటికలే అంటున్న బాబు
ఆలూ లేదు, చూలూ లేదని సామెత గుర్తు చేసిన బాబు
ప్రజాస్వామ్యంలో ఏమీ లేకుండా కలలు కనొద్దని హితవు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 : తెలంగాణా 2011లో వస్తుందనుకుంటే అది పగటికల మాత్రమే అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏమీ లేకుండా కలలు కనడం కరెక్టు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు ఏదో పెట్టారన్నట్టు అని బాబు సామెతను గుర్తు చేస్తూ, బుధవారంనాడు కె.సి.ఆర్. హైదరాబాద్‌లో కార్పొరేట్ సంస్థల సి.ఇ.ఓ.ల సమావేశంలో ఇచ్చిన హామీని బాబు తేలికగా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుంద ంటూ ఇన్వెస్టర్లకు ఎటువంటి ఢోకా లేదని కూడా ఈ సందర్భంగా కె.సి.ఆర్. హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
వుయ్ ఆర్ ఇన్ డెమొక్రసీ, ప్రజాస్వామ్యంలో ఏది పడితే అది మాట్లాడడానికి లేదు, ప్రతిదానికీ ఒక పద్ధతి, ప్రొసీజర్ ఉన్నాయని బాబు వ్యాఖ్యానించారు. పద్ధతులను పట్టించుకోకుండా అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటే కుదరదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం ఉంటే వారే అభివృద్ధి చేస్తారు గాని ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడితే కుదరదని ఆయన అన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణాలోని అనేక ప్రాంతాలలో తెలంగాణావాదులు రాస్తా రోకో చేశారు. అనేక చోట్ల బాబు దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.

Subscribe to:
Posts (Atom)