Thursday, August 5, 2010

యుద్ధం చేసి అలిసిపోయినట్టూ చతికిల పడ్డారేం

అంతా అయిపోయినట్టూ
యుద్ధం చేసి అలిసిపోయినట్టూ చతికిల పడ్డారేం
దిక్కులు చూస్తున్నారేం
తెగ ఆయాసపడి పోతున్నారేం
ఇంకా అసలు యుద్ధం మొదలవ్వ లేదు
ఆకాశంలో అక్కడక్కడా మేఘాలు కూడుకుంటున్నాయి
భూమి పొరల్లో చిన్నగా జ్వరం మొదలయ్యింది

అక్కడో మెరుపూ ఇక్కడో మెరుపూ కాస్త ఆశను కలిగిస్తున్నాయి
అక్కడో చుక్కా ఇక్కడో చుక్కా

కనపడీ కనపడనట్టు చీకట్లో దోవని చూపిస్తున్నాయి
అంతా అయిపోయినట్టు
సమస్తం సాధించినట్టు విశ్రాంతి తీసుకుంటున్నారేం కాళ్ళు బార్ల చాపి
వీపు సంసారం గోదాకానించి సుఖనిద్ర పోతున్నారేం
కాస్త ఊపిరాడక పొయ్యేసరికి
జెండాలన్నీ చుట్టచుట్టి చంకనబెట్టి
'తునా బొడ్డుమ్బాల్' అని చేతులెత్తేశారేం
ఆవిరికమ్మి చెమట పట్టటం మొదలయ్యేసరికి
రాసుకున్న ఎర్రరంగు కరిగిపోవటం మొదలయ్యింది
యుద్ధం చేసినట్టూ
విజయం సాధించినట్టూ
జయకేతనం ఒక అట్టముక్క ముక్కుకి వేళ్ళాడేసుకుని
బజార్లన్నీ ఊళ్ళన్నీ దేశాలన్నీ కలియదిరుగుతున్నారేం
ఇంకా యుద్ధం మొదలవ్వలేదురా - నాయనా
ఇప్పుడిప్పుడే కాస్త యుద్ద వాతావరణ మేర్పడుతోంది
పిండదశలోనే బిడ్డను కన్నంత శ్రమపడుతున్నారేం
వర్శమొచ్చే సూచనలున్నాయి - రా - బయటికి - రా
-- కే.శివారెడ్డి 8 October 1987

జై తెలంగాణ జై జై తెలంగాణ

శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి



దాకట్ మారట్ రే దాదా కొమురంబీమన్ జయన్ కటూ

దాకట్ మారట్ రే దాదా కొమురంబీమన్ జయన్ కటూ
దాకట్ మారట్ రే దాదా
కొమురంబీమన్ జయన్ కటూ
కోయ దాదన్ జయన్ కటూ
గోండు వీరన్ జయన్ కటూ
అడివిల ఎసుంటి పట్టి కట్టమని
అదిక శిస్తులకు ఎదురు నిలబడి
నాయక్ పోడు పరదాన్ కోసం
కొలాము తోటి గోండుల కోసం
బూమికోసమని బుక్తి కోసమని
అయుదమేత్తి సాయుధుడయినా
గోండు వీరునికి జయన్ కటూ
ఎండవానలు ఖాతరు చేయక
కొండకోనలా జనులను కలిసి
అన్నం పెట్టె అడవి గుండెలో
అగ్గిని ఆర్పగా అయుదమేత్తి
నిజాం సైనికుల నిలువనియకా
గెరిల్ల పోరుని గిర గిర తిప్పిన
కొమురమన్నకు జయన్ కటూ
కాగడ కాంతికి జయన్ కటూ
కడుపు కూటికని కొండలకొచ్చి
లుచ్చ దందలతో లూటి చేసి
మేకలు కోళ్ళు సారకు మరిగి
ఆడవాళ్ళ నరిగోస పెట్టుతూ
సాగు బూమిపై హక్కు దక్కదనే
హర్రం కోరుల అంతు జూడగ
అన్న కొమురముకు జయన్ కటూ
అగ్గి పిడుగుకు జయన్ కటూ
కట్టుబాట్లను కాలరసేర స్వ్చాకోసమై ముందుకొచ్చేర
కత్తితో కంటం ఉత్తరిచ్చినా
నమ్మిన న్యాయం అమ్ముకోనని
పేదల రాజ్యం కోసమే ప్రాణం
బావితరాలకు బలి చేస్తాననే
కొదమ సింగముకు జయన్ కటూ
కొమురం భీముకు జయన్ కటూ

ఆత్మార్పణ లింకొద్దురా

ఆత్మార్పణ లింకొద్దురా
బలిపీఠ మెక్కవద్దురా.., ఆత్మార్పణ లింకొద్దురా...
త్యాగాల చరిత మనదిరా, పొరాడి గెలువసాగరా
జై తెలంగాణ-జై తెలంగాణ, జై తెలంగాణా
"బలిపీఠం"-------
శ్రీకాంత్ దేహమెందుకు, పెనుమంటలల్లో కాలెను
పోలీస్ కిష్టయ్య తన ప్రాణ మెందుకిచ్చెను
మల్లేషం మంజులలు భార్యభర్తలయ్య
మూడు పదులు దాటిన ప్రేమ ముర్తులయ్య
ఎన్నేండ్లు వేదనంటూ, మాగుండె కోతనంటూ
ప్రశ్నించెవారి మరణం ఇక మిశ్రమించలేము
సలాం అమరులారా-సలాం అమరులారా
సలాం అమరులారా ........
"బలిపీఠం"-----
డిసెంబర్ తొమ్మిదొక, చీకటి రోజందుమా
పదకొండు గురి త్యాగపు, వెలుగు రేఖ లందుమా
విశ్వవిద్యాలయాల విద్యర్థుల పిడికిల్లు
వీధులన్ని అట్టుడికిన ప్రజా పోరు కెరటాలు
ఉరికొయ్య తీగవద్దు, పోరాటమాపవద్దు
పార్లమెంటు బిల్లుదాక, సల్లారదు మాకాక
సలాం అమరులారా-సలాం అమరులారా
సలాం-అమారులార......
"బలిపీఠం"
జై తెలంగాణ..!
జై జై తెలంగాణ...!

ఉరికే ఉరుకుల ఉద్యమ స్వరమా

ఉరికే ఉరుకుల ఉద్యమ స్వరమా
ఉరికే ఉరుకుల ఉద్యమ స్వరమా ఆ పరిమళం..
నేస్తమా, నీ ప్రాణం చేయకుమా ఇక బలిదానం..
తడుమును మమ్ముల..తడి ఆరని నీ తొలి స్వప్నం..
చితికే బ్రతుకుల చివరి పోరాటం..
ఆరని మంటల బ్రతుకొక ఆరాటం..
యేమో యేమయ్యిందో..
రాజీపడని నీ ధైర్యం..
యేమో యేమయ్యిందో..
వెనకకు తగ్గని నీ స్థైర్యం..
లేమా.. నీ వెనుకా.. లక్షలు కోట్లుగ మేమంతా..
రామా... కదలి రామా .. నీ అడుగున అడుగై మేమంతా..
ఒక్కొక్కటైన ఆశలన్నీ వెలగాలింక జ్యోతులుగా..
కన్నీళ్ళ రోజులు పోయి రావాలింకా తెలంగాణ..
చూడవా ఓ నేస్తం మాతోటీ నీ ఆశల స్వప్నం..
మానుకో, ఆపుకో నీ అంతిమ యత్నం..
ఆగవా.. వినవా.. ఒకసారీ మా విన్నపం..
చేద్దాం,.. సాధిద్దాం.. మన కలలన్నీ సాధిద్దాం..
రేపటి రోజులు మన వాడల్ల వెలుగులనే ఇక చూద్దాం..
నేస్తమా నీ ప్రాణం..
చేయకుమా ఇక బలిదానం..