జై ఆంధ్ర.. జై.. జై..ఆంధ్ర.
ఆంద్ర ప్రదేశ్ విభజన వల్ల ఆంద్ర లో ఉన్న సామాన్యునికి ఏమి నష్టం?? అసలు ఏమి లాభం ?? ఈ ఆందోళన లతో ఎంత కాలం విభజన ని అడ్డుకొని .. ఏమి సాధిస్తాం?? విభజనికి ఇంక మనం మానసికం గా సిద్దం అవ్వవలసిందే..
విశాఖ నుండి రాజధాని వెళ్ళాలంటే ఒక రోజు ప్రయాణం.. సరైన వైద్యం కోసం రాజధాని.. అక్కడ చిత్కారాలు .. ఈ కర్మ మనకి అవసరమా? మనమూ ఉప్పు .. కారమే గా తింటున్నాం.. విడి పొతే మనకి మనం బతకలేమా? విజయవాడో.. విశాఖో.. రాజమండ్రి నో.. రాజధాని అయితే మనం అభివ్రుది చేసుకోలేమా? ఇక్కడ మనం కొంచెం విశాల హృదయం తో.. ఆలోచిస్తే.. అర్ధం అవుతుంది..
మాట్లాడితే హైదరాబాద్ పోతుంది అంటారు.. ఎక్కడికి పోతుంది.. పాకిస్తాన్ లో కలిసి పోతుందా? ? హైదరాబాద్ ..ఆంద్ర ప్రదేశ్ రాజధాని కాబట్టే అంత అభివృధి చెందినది.. రేపు ఇక్కడో రాజధాని ఏర్పడితే అదే స్థాయి అబివ్రుది ఖాయం.. .. సాఫ్ట్ వేర్ కంపనీలు అన్ని హైదరాబాద్ లో ఉంటే...ఏమైంది... రేపు మన రాజధానికి వస్తాయి.. మన వాళ్ళు బెంగళూరు.. చెన్నై వెళ్లి ఉద్యోగాలు చెయ్యడం లేదా? ఇదీ అంతే.. హైదరాబాద్ వెళ్లి చేస్తారు.. అసలు హైదారాబాద్ అనే ఫోభియా ఎందుకు అంటే అన్నింటికీ అదే రాజధాని అయ్యింది.. ఆ తప్పే కొంప ముంచింది. ఒక్క సాదారణ పరిపాలనకే రాజధానిగా ఉంటే ఇంత గొడవ ఉండేది కాదు.. సాఫ్ట్ వేర్ ఉద్యాగాలకి, సాంకేతిక విద్యకి ,, వైద్య విద్యకి. ,, వైద్యానికి., న్యాయానికి ,, పారిశ్రామికానికి ...ఇలా చెప్పుకుంటే అన్నింటికీ హైదరాబాద్ నే రాజధాని చేసి పాలకులు తప్పుచేసారు..
అదే తప్పు రేపు ఆంధ్ర ఏర్పడితే జరగకూడదు..
ఇంకా నీళ్ళు రావు అని గోల ... ఎందుకు రావు..? మనం ఎన్ని నీళ్ళు వృధాగా సముద్రం లోకి వదిలేయడం లేదు? ఎన్ని నీళ్ళని వాళ్ళు ఆపగలరు ? మనం తమిళనాడు కి నీళ్ళు వదలడం లేదా? ఇదీ అంతే..
విభజన కోరుకొనే వాళ్ళల సంగతి మనకెందుకు.. వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారో మనకెందుకు? విదిపోతాం అంటున్నప్పుడు విడిపోవడమే... ఇంతా కాలం బతిమిలాడి.. బెదిరించి కాపురం చేయిస్తాము? విదిపోదామనుకుంటున్న ఎవరికీ అయిన ఇదే వర్తిస్తుంది.. రాయల సీమ అయిన.. మన్య సీమ అయిన, ఉత్తర ఆంధ్ర అయినా ..రేపు ఇంకోటి ఏదైనా... .. దీనికోసం మన ఆస్తుల్ని మనం తగల పెట్టు కోవడం.. మన చదువుల్ని.. మన భవిష్యత్తు ని మనమే పాడు చేసుకోవడం అవసరమా?
సమైక్య ఆంద్ర అనేది అంతా కోట్లకు..కోట్లు పడగలెత్తి ... హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించిన వాళ్ళే...తప్ప సగటు మనిషి కాదు..అనేది అందరికి తెలిసిందే...
రేపు ఎలాగు శ్రీకృష్ణ కమిటి ఎలాగు తెలుస్తుంది.. ఆగండి.. చూస్తూనే ఉండండి,.
నేను పుట్టింది... పెరుగుతుంది... కోస్తా ఆంధ్ర లోనే... ఆయ్... అదేనండి.. రాజమండ్రి .. నుండి.. నాకు వీలనంత త్వరలో ఆంధ్ర రాష్ట్రము చూడాలని ఉంది.. అప్పుడు నేను నా రాజధానికి ....ఉదయాన్నే ఇంట్లో టీ తాగి... నా 180 CC బైక్ మీద రాజధాని వెళ్లి పని చూసుకొని... సాయంకాలానికి వీలుంటే మద్యాహ్నం బోజనానికి ఇంటికి వచేస్తాను..
నా వాదన ఇదీ ... నా వాదనలో తప్పు ఏమీ లేదు.. మీకు వేరే వాదన ఉంటే అదీ తప్పు కాదు.. ఎవరి వాదన వారిది.. చివరిగా వచ్చేది... జై ఆంధ్ర.. జై.. జై..ఆంధ్ర..
కామెంట్స్... తో.. నా ప్రాంతం వాళ్ళే నన్ను ఉతికేస్తారు అని తెలుసు... ఎంత కాలం ఉతుకు తారు... ?? ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకే కదా?? ఏమంటారు??
source: http://www.innervoice.co.cc/2010/03/blog-post_22.html
No comments:
Post a Comment