Friday, March 26, 2010

శవాల మీద లేస్తున్న జెండాలు

కాలుతున్న శవాలు, నేల
రాలుతున్న పరిమళాలు
పచ్చి మాంసపు వాసనలపై
ఎగురుతున్నాయ్ చూడు
సమైక్యాంద్ర జెండాలు !!

యువత ఆత్మహత్యలు, కాదు ఇవి
బడుగు జీవుల హత్యలు
ప్రత్యేక పోరు వెనుక
సాగుతున్నాయ్ చూడు
శవపు రాజకీయాలు !!

అభివృద్ధి మంత్రాలూ
అతికొద్ది పంపకాలు
అణగారిన జనాలపై
లేస్తున్నాయ్ చూడు
పెత్తందారి కోటలు !!

ఇలాత్కయలమ్మే ఇస్మయిలూ, మోర్లూడ్చే మల్లిగాడు
వీళ్ళ కోసమేనట నేటి ఈ సిత్రాలు
పేదరికం ముసుగు వెనక
చిందులేస్తున్నాయ్ చూడు
కోట్లకు పడగలెత్తిన తారలు !!

కలిసుంటే స్వర్ణయుగం, విడిపోదామంటే

మారుతుంది వర్ణం
వెర్రివాదనొకటి పైకిలేచి
బ్రమపెడుతోంది చూడు
నక్స లైటు భూతం !!

ఒక్కటవుతున్నాయి జిత్తుల నక్కలు
ఖాళీ అవుతున్నాయి ధనం మూటలు
ఇపుడు చచ్చిన శవాల పై సైతం
విరుగున్నాయ్ చూడు
ఖాకీల చేతిలో లాఠీలు !!!

No comments:

Post a Comment