Thursday, September 23, 2010

తెలంగాణా వస్తుందనుకుంటే పగటికలే అంటున్న బాబు-ఆలూ లేదు, చూలూ లేదని సామెత గుర్తు చేసిన బాబు

తెలంగాణా వస్తుందనుకుంటే పగటికలే అంటున్న బాబు-ఆలూ లేదు, చూలూ లేదని సామెత గుర్తు చేసిన బాబు

2011 తెలంగాణా వస్తుందనుకుంటే పగటికలే అంటున్న బాబు
ఆలూ లేదు, చూలూ లేదని సామెత గుర్తు చేసిన బాబు
ప్రజాస్వామ్యంలో ఏమీ లేకుండా కలలు కనొద్దని హితవు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 : తెలంగాణా 2011లో వస్తుందనుకుంటే అది పగటికల మాత్రమే అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏమీ లేకుండా కలలు కనడం కరెక్టు కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు ఏదో పెట్టారన్నట్టు అని బాబు సామెతను గుర్తు చేస్తూ, బుధవారంనాడు కె.సి.ఆర్. హైదరాబాద్‌లో కార్పొరేట్ సంస్థల సి.ఇ.ఓ.ల సమావేశంలో ఇచ్చిన హామీని బాబు తేలికగా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుంద ంటూ ఇన్వెస్టర్లకు ఎటువంటి ఢోకా లేదని కూడా ఈ సందర్భంగా కె.సి.ఆర్. హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

వుయ్ ఆర్ ఇన్ డెమొక్రసీ, ప్రజాస్వామ్యంలో ఏది పడితే అది మాట్లాడడానికి లేదు, ప్రతిదానికీ ఒక పద్ధతి, ప్రొసీజర్ ఉన్నాయని బాబు వ్యాఖ్యానించారు. పద్ధతులను పట్టించుకోకుండా అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటే కుదరదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం ఉంటే వారే అభివృద్ధి చేస్తారు గాని ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడితే కుదరదని ఆయన అన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణాలోని అనేక ప్రాంతాలలో తెలంగాణావాదులు రాస్తా రోకో చేశారు. అనేక చోట్ల బాబు దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.

No comments:

Post a Comment