Please forward this message to students and youth in Telangana on behalf of
KNF(Kakatheeya NRI Forum).
* ** **ఒక** **గుండే** **చప్పుడు** **ఆగెనా** -- **అది** **దేశాలల్ల** **మోగెనా
*
“*మీకు **సందేశాలు **ఇచ్చేంత **పెద్ద **వాళ్ళం **కాము, **కానీ **పిట్టాల్లాగా *
*రాలిపోతున్న **యువకులను **చూసి **కాకతీయ **ప్రవాస **భారతీయుల **సంఘం* వారు ఈ
విన్నపం చేస్తున్నారు”.
తెలంగాణ యువకులు, విద్యార్ధులు రాజీ లేని పోరాటం చేసే సంస్కృతి కలిగిన వాళ్ళు.
మనకు చరిత్ర కూడా అదే చెప్తుంది, అది 1948 సాయుధ పోరాటం కావొచ్చు లేదా 1969
తెలంగాణ ఉద్యమం కావొచ్చు. మన పోరాటాల చరిత్రను ఎంతో గొప్పగా వివిధ దేశాలల్లో
పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటున్నారు, ఆధునిక ఫ్రెంచి విప్లవంగా
అభివర్నించుకుంటున్నారు:
*"**ఫ్రెంచి** **విద్యార్దులు** **సందమామ** **నీ** **అంతటి** **గాళ్ళు** **
సందమామ** - **అరె** **నీకన్న** **ధీరులు సందమామ** **తెలంగాణా** **పిల్లలు** **
సందమామ*
*జై** **తెలంగాణ** **అంటే** **సందమామ** **జై** **తెలంగాణ** **అని** **సందమామ**--
**సయ్యంటే** **సై** **అని** **సందమామ** **పోరాడినారయ్య** **సందమామ**"*
ఇంత గొప్ప పోరాట పటిమ కలిగిన తెలంగాణ పిల్లల్లో కొంత మంది మనస్తాపానికి గురై
ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన కంటే ముందు తరాల వాల్లు ఎన్నో అవమానాలను,
ఒత్తిళ్లను ఎదుర్కోని ఉద్యమాన్ని చివర అంకం వరకు తీస్కొచ్చి, మన తరానికి
అందించారు. తెలంగాణా ఫలాలను అనుభవించాల్సిన మనము ఆత్మహత్యలకు పాల్పడటం ఎంతో
దు:ఖాన్ని కల్గిస్తుంది. మన తాతల, తండ్రుల స్పూర్తితో మనము (యువకులము) రాబోయే
యుగపు దూతల్లాగా, జీవితం అనే మహా పోరాటం లో కష్ట సుఖాల పాఠాలు నేర్చుకుంటూ,
తెలంగాణ కలల పంటను ముందుకు తీసుకెల్లాలి:
*"**చెమట **సుక్క **సిరా **కలమై **అక్షరాలు **పూర్చాలి -- **జీవితమే **కఠిన *
*శ్రమై **పాఠాలెన్నో **నేర్పాలి*
*మన** **దారీ** **నిండ** **ముండ్లని** **దారీ** **తప్పమాకురా ** -- **కల్లోలం*
* **కష్టాలని** **సత్యమిడ్వమాకురా* *తెలంగాణ** **కలల** **పంట** **నేల** **
రాలుతుందని** **అధైర్య** **పడొద్దు ** -- **అది** **మొలకలెత్తి** **వేల** **వేల
** **రాసు** **లవునులే**”*
ఇలా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం మీతో పాటు ముందడుడు వేయాలని, మన ఆశలని
ఆశయాల్ని నెరవేర్చుకునే దిశగా *కాకతీయ **ప్రవాస **భారతీయుల **సంఘం* తమ వంతు
కృషి చేస్తుంది.
*వీర **తెలంగాణ **పోరు **తెలంగాణ -- **పాపం **నశించు **గాక **ధర్మం **జయించు **
గాక*
ఇట్లు,
*కాకతీయ **ప్రవాస **భారతీయుల **సంఘం.*
No comments:
Post a Comment