పాదపాదాన పరిపరి దండాలు..
చాకలి శ్రీనివాస్ గెలిచాడు. ధర్మపురి శ్రీనివాస్ ఓడిపొయ్యాడు. ఉప ఎన్నికల్లో చాకలి శ్రీనివాస్ అభ్యర్థికాడు. ఇప్పుడు తన గెలుపును తాను ఆస్వాదించడానికి ఈ భూమ్మీద కూడా లేడు. మరణానంతర మెరుపు నక్షత్రం అతను. తెలంగా ణ కోసం విరిసిన తార అతను. డీ.శ్రీనివాస్ అనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి చాకలి శ్రీనివాస్ ప్రత్యర్థీ కాడు.
కానీ డీ. శ్రీనివాస్ మందూ, మార్బలాన్ని, నోట్లకట్టలను, రెండుముఖాలను, ఆడి తప్పిన అబద్ధాల పుట్టను..మొత్తంగా ఎలక్షనీరింగ్ అనే సవాలక్ష అక్రమాల గనులను బద్దలు కొట్టి గెలిచాడు చాకలి శ్రీనివాస్. వరంగల్‌లో మిర్యాల్‌కార్ సునీల్‌కుమార్ గెలిచాడు. అతనొక జర్నలిస్టు. తెలంగాణ కోసం నిలువునా ప్రాణం తీసుకున్నా డు సునీల్. రాయరాని, రాయలేని, రాయజాలని వార్తల కోసం మరణించిన సునీల్ గెలిచాడు.
అతని ఆత్మ మళ్లీ ఒకసారి వరంగల్ జిల్లా మీద తెలంగాణ మనసుగా.. ఏకాత్మగా వెలుగుతున్న ది. పేర్లెందుకు? ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక సాయికుమార్ మీగడ, ఒక సవేరా బేగమ్.. శిల్పాల మీద చెక్కాల్సిన నాలుగువందల మంది పైబడిన తెలంగాణ ఆకాంక్షలు వాళ్లు.. మరణానంతర విజయ సోపానాలు వాళ్లు.. ఎన్నికల విజయా లు.. మన దేశపు భ్రష్టుపట్టిన 'ఎలక్షనీరింగ్ ప్రలోభాల వల్ల కురచవి. తాత్కాలికమైనవి. అంతిమ పరిష్కారాల సాధనలో ఉపయోగపడనివి.
అలాంటి కురచ విజయాలను మహా శిఖరంలా మలిచిన వాళ్లు తెలంగాణ ప్రజలు. ఏమివ్వగలం..వారికి.. తెలంగాణ తప్ప. ఒక భ్రష్టుపట్టిన ఎన్నికల రూపాన్ని కూడా టీఆర్ఎస్, బీజేపీ దుమ్మురేపడానికి.. కాంగ్రెస్, టీడీపీ దిమ్మ తిరగడానికి అస్త్రంగా మలుచుకున్నారు తెలంగాణ ప్రజ. ఏకాత్మను అంగీకరిస్తామా? లేదా? అవునిది ఏకాత్మే.. హూ ఈజ్ అరవిందరెడ్డి.. తెలంగాణ తేల్చుకు రమ్మని, సైరనూది సమర రంగాన కదను తొక్కకముందు.. అరవిందరెడ్డి టీఆర్ఎస్‌తో గొడవలో ఉన్నాడు.. కేసీఆర్ అతనికి ద్రోహిగా కనబడ్డాడు. వై.ఎస్. దేవుడి గా దర్శనమిచ్చాడు.
ఇవ్వాళ అరవిందరెడ్డి మెజారిటీ డెబ్భైఏడు వేలా.. ఎవరు గెలిచారు. మంచిర్యాల్ గెలిచింది. మంచిర్యాల్ నిలిచింది. చరిత్రను తిరగరాస్తున్నది తెలంగాణ. ఒక ముసల్మా ను కాషాయ వర్ణపు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని జైతెలంగాణ అంటూ యెండల లక్ష్మీనారాయణ గెలుపు కోసం దూలాడినట్టు.. దుంకినట్టు ఎగరడం ఊహించగలరా? నిజామాబాద్ విజయగర్వం చూడండి. దేనికి సూచన ఇది. మతం లేదు. కులం లేదు. నోట్ల కట్టలు లేవు. మందు లేదు. బ్రాందీ లేదు. వాగ్దానం లేదు.
వాగాడంబరం లేదు. ఐసు ఐసు పథకాలు లేవు. నైసునైసు మాటలు లేవు. ఒకటే ఉనికిలో ఉంది. ప్రజల మనసు ల్లో.. లోపలి పొరల్లో.. ఇంకిపోయింది తెలంగాణ. పాతుకున్నది తెలంగాణ. కొప్పుల ఈశ్వరా? కావేటి సమ్మయ్యా.. చెన్నమనేని రమేశా? కల్వకుంట్ల తారకరామారావా? తన్నీరు హరీష్‌రావా? వినయ్‌భాస్కరా? ఈటెల రాజేందరా? ఏనుగు రవీందర్‌రెడ్డా? నల్లాల ఓదెలా? ఎవరైతేనేం విజయానికి ఒక ప్రతిమ కావాలి. విజయానికి ఒక రూపు కావాలి. విజయానికి ఒక పేరు కావాలి.
నిజమే హరీష్ హుర్రే.. హుర్రే.. తొంభైయిదు వేల మెజారిటీ. అదీ చరిత్రే. అతను, ఈటెల రాజేందర్ మంచి ఎమ్మెల్యేలు కూడా కావొచ్చు. అయినా మరీ అంత ఏకపక్షం ఎలా సాధ్యం.. నాలుగు వందల మంది అమరవీరుల బలిదానాలకు అంకితమిచ్చిన హరీష్‌రావు, ఈటెలల విజయం తెలంగాణ ప్రజల విజ యం. చనిపోయిన వారి ఆత్మలు మేల్కొనడమంటే ఇదే.. వాళ్ల ఆత్మలు ఆకాంక్షలై ప్రతిఫలించడమంటే ఇదే.. నలుగురు వెలమదొరలు ఒకేవాహనం మీద ఎక్కి ఎములాడల, సిరిసిల్లల తిరిగి ఎన్నికల ప్రచారంల మాట్లాడి నిలిచి.. గెలవడం ఎట్లాసాధ్యం.
అది సిరిసిల్ల.. అది జగిత్యాల. అయినా సాధ్యమే. తెలంగాణకు ఇప్పుడు ఏ ఎజెండా లేదు. ఒకే ఎజెండా.. విద్యాసాగర్‌రావు, రమేష్‌రావు, తారకరామారావు, చంద్రశేఖర్‌రావు ఎవరైతేనేం? వాళ్లే తెలంగాణ ఆత్మలను ఆవాహన చేసినంత కాలం గెలుస్తా రు. మరో మాట లేదు. ఉన్నదొకటే ఎజెండా? దొరలు .. తర్వా త.. ముందు మా తెలంగాణ మాగ్గావాలె.
మతం తర్వాత మా తెలంగాణ మాగ్గావాలె. కులం తర్వాత మా తెలంగాణ మాగ్గావాలె.. యథా ప్రజ .. తథా రాజ.. రాజులారా! ఇక తెలంగాణల ఇదే నిజం.. ప్రజలున్నట్టు మీరుంటేనే భూమ్మీద మీకు నూకలు..లేదంటే మీకు నూకలు చెల్లు.. నిజమే సర్వ అవలక్షణాలనూ తెలంగాణ ఓడించింది. బాబ్లీ ఎందుకంటావో? తెలుసు.. బాబ్లీ వెనువెంటనే మీరు తెచ్చిన తెలుగు జాతి ఆత్మగౌరవం ఎంత ప్రమాదకర నినాదమో తెలుసు. ఇరవై ఎనిమిది ఏండ్ల క్రితానికి, ఎన్టీఆర్ కాలానికి వెళ్లడానికి సిద్ధంగా లేదు తెలంగాణ.
ఆత్మగౌర వం ఒకమాయ. అదొక అబద్ధం. నిజమే బాబ్లీ అన్యాయమే కావ చ్చు.. కానీ ఆ తర్వాతి తెలుగుజాతి ఆత్మగౌరవం తెలంగాణ గౌర వం పీకనొక్కి న క్రితం ఒక చేదు జ్ఞాపకం. ఎంత విజ్ఞత తెలంగాణది. తెలుగుజాతి ఆత్మగౌరవ అసలు అంతరంగ స్వభావాన్ని బీజరూపంలో పసిగట్టిన సిస్మొగ్రాఫ్ తెలంగాణ. ఇప్పుడు అది రాబోయే పెను ముప్పును కనిపెట్టగలదు. రెండు కళ్ళ సిద్ధాంత కర్తల అసలు దృష్టినీ, అవతారాన్నీ కనిపెట్టగలదు. డిపాజిట్లు గల్లంతవుతాయి జాగ్రత్త.. ఇక చెల్లదు.
ఇది గుర్రం ఇది మైదానం. అటా.. ఇటా.. ? ఎటో ఒక దిక్కే.. తొమ్మిదో తారీ ఖు గీటురాయి. నువ్వేం మాట్లాడ్తున్నావో? బాబ్లీ అనంతర ఆత్మగౌరవం ఎవరిదో .. పసిగట్టింది తెలంగాణ. డీ. శ్రీనివాస్ బంగా రు పళ్లాన్ని నమ్మలేదు తెలంగాణ.. చెన్నారెడ్డి బంగారు పళ్లెంలో పెట్టి మున్నూటా డెబ్భై మంది తలలను ఇందిరాగాంధీకి సమర్పించిన ద్రోహం.. ఎక్కడ మళ్లీ ప్రారంభమవుతున్నదో పసిగట్టింది తెలంగాణ. మహా ఉద్యమ అనంతరం ..మహా ఊరేగింపుల అనంతరం.. మహా జనసాగరాల అనంతరం.. ఒకే ఒక్క మాట.
తెలంగాణ. నిజమే.. తెలంగాణ కోసం మరణించిన ఒక కొడుకు కోసం పరితపించే ఒక తల్లికి ఈ విజయాల పూలహారం. ఆ అమ్మకిప్పుడు నాలుగు కోట్ల మంది కొడుకులు, కూతుళ్లు. తెలంగాణ కోసం వాళ్లు నిలబడ్తున్నారు. ఇస్తమని ఇవ్వరు. తెస్తమని తేరు. శవాల మీద పడి ఏడ్చిన వాళ్ళు కన్నీరు ఇంకక ముందే కల్లబొల్లి కబుర్ల కాకారాయుళ్లవుతరు. అందుకే.. బహు పరాక్.. బానిసకొక బానిసకొక.. బానిసలోయి బానిసలయిన తెలంగాణ ప్రియనేతలా రా! కాంగ్రెస్ మసిబూసి మారేడు కాయ చేస్తే.. ఇచ్చిన మాట తప్పితే బండకేసి కొడ్తది తెలంగాణ.
రెండు కండ్లు..మూడు నాల్కలు.. ఐదు ముఖాలు.. ఆరు ఆత్మగౌరవాలు చెల్లవు గాక చెల్లవు.. తెలుసుకోండి..మేల్కొన్నది తెలంగాణ.. నిజమే.. పన్నెండు సీట్లతో తెలంగాణ రాదు. మరో పన్నెండు సీట్లతో రాదూ పోదు. కానీ.. చరిత్ర నిండా.. కాలం నిండా.. తెలంగాణ ప్రతి మలుపులోనూ.. ప్రతి సందర్భంలోనూ.. తెగేసి చెబుతున్న ది.
నిలేసి అడుగుతున్నది. నీళ్లు నమలకు.. మరో మాట లేదు. ఇది తెలంగాణ ప్రజల విజయం. నిలబడి, కలెబడి నిలిచి గెలిచిన తెలంగాణ రేపటి పొద్దు తెలంగాణలోనే.. లేదా.. బానిస నేతలకు పుట్టగతులు లేవు.. మరి రావు.. మరోసారి.. మరోసారి. ఈ గడ్డమీద పుట్టిన ప్రజలకు.. ఈ గడ్డ కోసం ప్రాణాలను తృణప్రా యం చేసుకున్న వీరులకు ... వినమ్రంగా పాదపాదాన.. పరిపరి దండాలతో... హేల్ తెలంగాణ.. హేల్.. తెలంగాణ పీపుల్..
Telangana Forums is an independent Telangana Friends online community which fights for the seperate statehood of Telangana. Now it is a historical time for all the Teleangana students, employees, writers, teachers, professionals, and Intellectuals to unite for the Telangana Movement
Friday, August 13, 2010
Wednesday, August 11, 2010
క్షతగాత్రం... Allam Narayana
క్షతగాత్రం...
అంతా బాగానే ఉన్నట్టుంటుంది. మబ్బులు చెదిరినట్టు.. పొద్దు పొడిచినట్టు.. సూర్యకిరణంలా ఆశ వెలిగినట్టు.. ఆశను ఎలాస్టిక్‌లా సాగదీసినట్టు..కొద్దిసేపే.. జయం.. విజ యం.. మత్తింకా వదలక ముందే.. మళ్లీ ముసురు. మళ్ళీ రాజకీయ మబ్బులు. మళ్ళీ కమ్ముకునే చీకటిలాంటి దుర్భేద్యమైన అజ్ఞానపు, అహంకారపు రాజకీయ మాటల మూటలు.. తెలంగాణను రానివ్వరనే కంటే అనైతికంగా అడ్డుకునే వారెవ్వరనేదే అసలు ప్రశ్న. హేతువుకు అందకుండా, తార్కికతకు తావు లేకుండా.. బుర్రలో పుట్టిన బుద్ధి కొలమానాల అంచనాలు.
విశ్లేషణలు. ఆరోపణలు. అవహేళనలు. ఎకసక్కాలు. మళ్లీ ఎవర న్నా పిరికిపందలు ఆత్మహత్య చేసుకుంటే.. భయమేస్తున్నది ఇషాన్.. నువ్వొక పిరికి పందవి.. మైసమ్మకు మేకల్ని బలిస్తారు. నువ్వొక అమాయకపు మేకవి. నిన్ను నువ్వు బలిచ్చుకోవడానికి ఏం మిగిలిందని? ఎవడి గెలుపు కోసమో? ఎవడి ఓటమి కోస మో.. బావుల్లోకి ఉరుకుతున్న వాడా.. నువ్వొక బలిమేకవి.
నీది ఆత్మహత్యా! బహురూపుల రాజకీయ నేతలు చేసిన హత్యా! ఇషాన్ .. నీ శవం ముందు భీకర ప్రతిజ్ఞలు, కన్నీళ్ళు, వేదన, ఉక్రోశ, ఆక్రోశాలు.. కమ్ముకున్న దిగులు. మీ అమ్మ అట్లాగే ఉంది. దిగులు గూడులా.. మూటలా పడి ఉన్న నిలువు దుఃఖం మీ అమ్మ. ఏం చెబ్తావ్. ఇషాన్. తెలంగాణలో పుట్టిన వాడివి కదా. మాటలకు తూటాలు తొడిగే నేల మీద పడిన వాడివి. పారాడిన వాడివి కదా. బతుకు అంటే నిత్య సంక్షోభం, అనునిత్య పోరాటం అనే చోట కన్ను తెరిచిన వాడివి కదా. కొన్ని శవాలు.
కొన్ని ఛిద్రమైన కలలు. కొన్ని భావుకతలు. ప్రపంచ జ్ఞాన నేత్రం కూడా తెరుచుకున్న వాడివి కదా. ద్రోహులెవరో? తెలుసు. హంతకులెవరో తెలుసు. ఏ తీపి మాటల వెనుక ఎంత విషం ఉందో? తెలుసు. ఏం చెయ్యాలో ? తెలుసు. బాబ్లీ డ్రామాలు కనిపెట్టిన వాడివి. పోలవరం డ్రామాలతో పోదు. నిలబడి నిజపోరాటం చెయ్యమని కోరిన వాడివి. జ్ఞానం ఉన్న వాడివి. ఇషాన్. నిన్నిక కీర్తించలేను. ఆత్మహత్య నైతికతల ప్రకారం, అలౌకికతల ప్రకారం మహాపాపం. ఆత్మహత్య ఒక చేతగాని , చేవలేని, బలహీన మనస్కుడి అంతరంగ కల్లోలం. తెలిసి తెలిసీ, ఆత్మహత్య చేసుకున్నందుకు జీవితకాలం నిన్ను క్షమించలేను. కీర్తించలేను. అమరుడివన లేను.
వీరుడవనలేను. క్షమించు ఇషాన్. నీ కోసం మీ అమ్మ లాగే నేనూ రెండు వెచ్చటి కన్నీటి బొట్లు వదలగలను. కానీ.. అసహాయంగా నీ దేహం ముందు నిలబడి నిలువు శోకంలా .. నువ్వు మీ పెదనాన్ననీ, చిన్నాననీ.. నీ బాపునీ మోసం చేశావు. లౌకికతల ప్రకారం ఆత్మహత్య పిరికిందల చర్య. నిజమే. నీ తర్వాత కొంత పరంపర. రోజూ రెండూ మూడూ .. సంఖ్యలు భయపెట్టే సందర్భం. అంకెలు భీతి గొల్పే సమయమిది. నిజమే. మరు నిమిషంలోనే విజయాన్ని అవహేళన చేసినప్పుడు నారా జ్ అవుతాం. వాళ్లు కోరిన పరిధిలోనే.. వాళ్లు పెట్టిన షరతుల పరిధిలోనే. వాదం ఉంటే. గెలిచి చూపించమన్న పరిధిలోనే . నిలబడి గెలిచి చూపేదే అసలు తెలంగాణ.
ద్రోహ చింతన ఒకరిదని కాదు. చిదంబరంది. కేంద్రానిది. సోనియా గాంధీది. మాయమాటలు చెప్పే తెలంగాణ కాంగ్రెస్ నేతలది. అడ్డగోలు వాదన లు చేసే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలది. రాజీనామాల అనంతరం గోసులు ఎగబోసుకుంటూ పోటీకి దిగిన భారీ కాయాల.. అంగుష్టపు బుద్ధులది. మెదడు నిండా ఒకే ప్రాంతపు అధిపత్యం. కళ్లల్లో రెండు నిలువు నాటకాలు.
అంగుట్లో అలవాటైన పచ్చి అవకాశ వాద పరిభాష. నిలువెత్తు మోసం. ఉద్వేగాలతో.. ఆడుకునే నీచం. నాయకుని బానిస. తెలంగాణ పోటీదారు. కన్నీళ్లలోనూ కల్మషం. ఏం చెప్పను పోటీపడి, సిగ్గులేకుండా నాటకాలాడి. తెలంగాణకు ఎదురీది.. ఎదురేగి, భంగపడ్డ బానిసల మాటలు ములుకులే. శరాఘాతా లే. అయితే మాత్రం. ఎవడు పట్టించుకుంటాడు. రుద్రభూమి నీది. ఎంత చరిత్ర చెప్పను. గెలుస్తా మా? నిలుస్తామా? సందేహాలు.. సందిగ్ధాలూ మనవి కావు. ఎక్కడ అక్రమం ఉంటుం దో, అక్కడ! ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ! ఎక్కడ రాజ్యం పడగ విప్పుతుందో? అక్కడ.
ఎక్కడ దోపిడీ మూలుగలు పీలుస్తుందో . అక్కడ దండోరాలు కొట్టి దండయాత్రలు చేసిన వీరభూమి మీద పడిన వాడా! పోరాటమే ఊపిరిగా ఎదిగిన నేల మీద. ఎన్ని చరిత్రలు ఎన్ని సార్లు చెప్పాలి. రక్తంలో పోరాట తత్వం ఉండాలి. రాదా! రాకపోయిన కానీ కొట్లాడు. విజయమో? వీర స్వర్గమో? ఒక నినాదం. కానీ.. ఎవరిని వారు కాల్చుకునే నిస్సహాయ, అసహాయ అవమాన సంస్కృతి ఎందుకు అబ్బింది ఇషాన్‌రెడ్డీ.. నిజమే. ఒకరు గెలిచినవి పదకొండే కదా! ఎవరివి వాళ్లకే అనవచ్చు.
నేరుగానే అవమానపరచవచ్చు. ఓటు వేయని నలభై శాతం మంది సమైక్యవాదులే అనే విదూషక రాజకీయ వేత్తా ఉండవచ్చు. పాత వాదనలను కొత్త తెరమీద కు తెచ్చి మనసును గాయపరచవచ్చు. న్యాయం ఏ పక్షం? మిత్రులారా! ఎవరి ది ప్రాంతీయవాదం! నిజ మే వెనుకబాటుతనం, ఆర్థికాభివృద్ధి, అంకెల గారడీ, నీళ్లూ, నిధులు, కాలువల మళ్లింపులు, సంస్కృతి.. చావుబతుకులు, భాష, యాస అరిగోసలు అనేకం చెప్పీ, చెప్పీ నోరు నొప్పు పుట్టి.. ఇక ఒకే ఒక మాట. ఏదీ లేదు. అసలు వాదనే లేదు.
ఒక ప్రాంతంగా విడిపోవడానికి.. ఉన్న హక్కుగామాకు తెలంగాణ కావాలె. వాదనలు బంద్. అది మీరిస్తే తీసుకొనేది కాదు. ఒక అమ్మ ఇయ్యడానికి.. ఒక అయ్య మూయడానికి తెలంగాణ దుక్నం కాదు. సమైక్యమో.. ఆంధ్రమో.. తెలుగో.. సమగ్రతో... దేశమో.. జాతో.. నీతో.. రీతో.. రివాజో..జాన్తానై. కలిసి ఉన్నాం. కుదరదనుకుంటున్నాం. అది మా ప్రాంతం మీద మా హక్కు. నక్సలైట్లో? దొరలో? దొంగలో? బద్మాషులో? దుర్మార్గులో? హంతకులో? ఎవరో ఒకరు.. ఒక ప్రాంతం స్థితి గతుల సంగ తి.. ఒక ప్రాంతం బాగోగుల సంగతి ఆ ప్రాంతానికి వదిలితేనే మర్యాద.
ఇదీ ఇషాన్.. నువ్వు చనిపోకుండా మాట్లాడాల్సిన మాట. అదే యూనివర్సిటీ లైబ్రరీముందు.. అదే ఆర్ట్స్ కాలేజీ ముంగట.. అదే యూనివర్సిటీ తారురోడ్డు మీద నెత్తురు కోలాటమాడిన వాళ్లంతా ధైర్యంగానే ఉన్నారు. జులుస్ తీసి జులుమ్‌లను ఎదిరించిన వాళ్లంతా ఇంకా మనసునిండా దట్టించిన ఉద్వేగాలతో నిలిచే ఉన్నారు. వాళ్లొక సభ అవుతున్నారు.
కదిలిపోతున్నారు. కన్నీరవుతున్నారు. కూడలిలో తమను తాము కూడగట్టుకున్న ఊరేగింపు అవుతున్నారు. ఒక కంట కన్నీరు.. మరో కంట నెత్తురు... తెలంగాణ జీవితమే అంత. అశ్రువొక్కటి ధారవోసిన త్యాగాల గడ్డ మాత్రమే కాదు. నెత్తురు చిందించిన వీరగడ్డ కూడా. ఆత్మహత్య ఎంతమాత్రం త్యాగం కాదు. ఆత్మహత్య ఎంతమాత్రం.. నీ ఆకాంక్షల సాఫల్య ఆయుధం కాదు. ఆత్మహత్యవద్దు.. ప్రియమైన పిల్లలారా! ప్రియమైన కనుపాపలారా! హంతకుడెవరు? అండమాన్‌లకు పంపాల్సిన రాజకీయ నాయకులే హంతకులు.
న్యాయం అడిగిన ప్రతిసారీ; ధర్మం అడిగిన ప్రతిసారీ.. రాజ్యాంగం ప్రసాదించిన విడిపోయే హక్కు అడిగిన ప్రతిసారీ.. బుల్లెట్లిస్తారు. సరే. భరిస్తాం. లాఠీలిస్తారు.. సరే నెత్తురోడుతాం. కానీ అబద్ధాలిస్తారు.. ఆటు మాటలిస్తారు. పోటు మాటలిస్తారు. అదే సమస్య. అదే కత్తి నేరుగా దిగనికుట్ర. పొడిచే పోటుకన్న మాయమర్మం. ఇప్పటి సమస్య.
అది కనిపెట్టి తిరిగినవాడే నేటి హీరో.. మార్మిక మంత్రాల మాయల మరాఠీ ప్రాణం దూరిన చిలకను మెడపిసక గలిగినవాడే నేటి హీరో.. కుట్రలనూ, కుతంత్రాలను ఎదిరించి నిలబడగలిగిన వాడే మొనగాడు.. వాడు వీధిలో రెండు కాళ్లు నిగడదన్ని నిలబడి నినదిస్తున్న ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి..ఇషాన్ నిన్ను ప్రేమించలేను.. నిన్ను కీర్తించలేను. ఎవడు యుద్ధరంగంలో క్షతగాత్రుడయినా వీరోచితంగా నిలబడి ఉన్నాడో.. వాడికే నా వందనం.. హంతకుడు తెలుసు.. హంతకుడి మీద కత్తి ఎత్తిన వాడే కథానాయకుడు.

తెలంగాణ బిడ్డలారా.. తెలుసుకోండి! -1
'నా తెలంగాణ.. కోటి రతనాల వీణ..' ఇది ఒకప్పటి మాట.. నేడు ఈ ప్రాంత బిడ్డలు కష్టాల కొలిమిలో కాలిపోతూ కన్నీళ్లు పెడుతోందెందుకు..? ఆకలి మంటల్లో కాలుతూ మరణశయ్య మీద కొట్టుమిట్టాడుతోందెందుకు..? బుక్కెడు బువ్వకు దిక్కు లేక, డొక్క నిండేందుకు రెక్కాడక వలస బాట పట్టిందెందుకు..? పసి పిల్లల జీవితాలకు వెలకట్టడెమెందుకు.. పడతి మానానికి ఖరీదు కట్టడమెందుకు..? బ్రిటిష్ పాలకులతో పోరాడి గెంటేసినా, రజాకార్లను రక్తం చిందిస్తూనే తరిమికొట్టినా తీరని ఈ అవస్థను సృష్టించింది ఆంధ్రపాలకుల వ్యవస్థ. ఇది నిష్టూర సత్యం.. నిత్యం కళ్ల ముందు కనిపించే సత్యం.. ఇది తెలియాలంటే మీకు తెలంగాణ ఏమిటో తెలియాలి.. ఉమ్మడి రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలియాలి.. వాటి వల్ల ఏర్పడిన నష్టాలు తెలియాలి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో కలిగే లాభాలు తెలియాలి.. తెలుసుకోండి.. ఒక్కసారి ఆలోచించండి..!
నాటి తెలంగాణ
రాజకీయ చరిత్ర చూస్తే 1294-1351 కాలంలో ముల్కీ ఉద్యమాలు ముఖ్య పాత్ర పోషించాయి. ఖిల్లీ, తుగ్లగ్‌లతో పాటు దక్షిణాది నుంచి వచ్చి స్థిరపడిన వారందరినీ దక్కనీలుగా పిలిచారు. ఆ తర్వాత విభేదాలతో వీరంతా షియాలు, సున్నీలుగా విడిపోయారు. 1422-1435 కాలంలో ఒకటో అహ్మద్‌షా కాలంలో ఈ విభేదాలు తారా స్థాయికి చేరాయి. 1436-1458లో రెండో అహ్మద్‌షా కాలం నాటికి ఇవి మరింత తీవ్రమయ్యాయి. 1512లో కూలీకుతుబ్‌షా ఈ ముల్కీ, నాన్‌ముల్కీ ఉద్యమాల ఫలితంగా సంభవించిన రాజ్య పతనం నుంచి గుణపాఠం నేర్చుకొని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాడు.
మళ్లీ తలెత్తిన ముల్కీ సమస్య
ఐదో నిజాం కాలంలో మళ్లీ ముల్కీ సమస్య తలెత్తి ఉద్యమాలు మొదలయ్యాయి. అవి ఈనాటికీ రావణ కాష్టంలా కాలుతూనే ఉన్నాయి. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగి మొగల్ సామ్రాజ్యం అంతరించగానే ఢిల్లీ, లక్నో, ముర్షిదాబాద్ ప్రాంతాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ఏ కల్లోలం లేని నిజాం రాజ్యానికి వలస వచ్చారు. కవులు, కళాకారులు, విద్యావంతులు ఇక్కడికి తరలివచ్చారు. ఐదో నిజాం కాలంలో సాలార్‌జంగ్ పరిపాలనా సంస్కరణల వల్ల కాయస్తులు, ఖత్రీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం వలస వచ్చారు. స్థానికులకు శిక్షణనిచ్చి తీర్చిదిద్ది వెనక్కి వెళ్లిపోతారన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ సంస్కరణ బెడిసి కొట్టింది. ఇక్కడే తిష్ట వేసుకొని ఉన్న ఉద్యోగాలే కాకుండా వచ్చిన ఉద్యోగాల్లో కూడా తమ వారినే నియమించుకొని స్థానికులను అణిచివేశారు. కిషన్‌ప్రసాద్ బహద్దుర్ పోరాటంతో కొంత మేరకు ప్రయోజనం చేకూరినా ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది. 1948లో పోలీసు చర్య జరిగే వరకు ఉస్మానియా యూనివర్సిటీలో నాన్‌ముల్కీలదే పెత్తనం.
మొగ్గ తొడిగిన నిరసన
నైజాం హైదరాబాద్ సంస్థానం మూడు భాషా ప్రాంతాలతో కలిసి ఉండేది. రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలుగు మాట్లాడే 8 జిల్లాలు హైదరాబాద్‌లో ఉండేవి. వీటితో పాటు మరాఠీ భాష మాట్లాడే 5 జిల్లాలు, కన్నడం మాట్లాడే మూడు జిల్లాలు కలుపుకొని మొత్తం 16 జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి. 1948 సెప్టెంబరు 13వ తేదీన భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్యను ప్రారంభించింది. సెప్టెంబరు 17వ తేదీన నిజాం రాచరికం అంతమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో మిలిటరీ గవర్నర్‌గా జేఎన్ చౌదరినినియమించారు. 1949 డిసెంబరు వరకు ఇది కొనసాగింది. 1950లో సీనియర్ సివిల్ అధికారి వెల్లోడి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. 1952 సాధారణ ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా నూతన ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే సమయంలో ఉద్యోగాల వేటలో ఆంధ్రులు తెలంగాణకు వలస రావడం ప్రారంభమైంది. తెలంగాణ వారికి ఇంగ్లిష్ పరిజ్ఞానం లేదన్న సాకుతో ఇష్టారాజ్యంగా ఆంధ్రులను ఇక్కడి ఉద్యోగాలలో నియమించడం మొదలైంది. ఈ నేపథ్యంలో 1952 ఆగస్టులో హైదరాబాద్ హిత సంరక్షణ సమితి పేరిట తొలి ఉద్యమం ఆంధ్రుల పెత్తనానికి నిరసనగా మొగ్గతొడిగింది. కానీ అధిష్టానం బెదిరింపులు, బుజ్జగింపుల కారణంగా మొగ్గలోనే రాలిపోయింది.

ఓరుగల్లులో శ్రీకారం..
ఆంధ్రపాలకుల అహంకారజ్వాలలో మాడిపోయిన తెలంగాణ వాసుల పోరుకు ఓరుగల్లులో శ్రీకారం చుట్టారు.మొదట ఈ ఉద్యమం విద్యార్థుల ఆధ్వర్యంలో 1952 జూన్ 26న వరంగల్‌లో ప్రారంభమైంది. స్థానికేతరులను ఉద్యోగాల నుంచి తొలగించి స్థానికులకు అవకాశం కల్పిస్తామన్న హామీతో ఉద్యమాన్ని విరమించారు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 7వ తేదీన ఖమ్మం మెట్టులో మరో ఉద్యమం జరిగింది. ఆ తర్వాత సికింద్రాబాద్, ఔరంగాబాద్ తదితర చోట్ల ఆందోళనలు జరిగాయి. హన్మకొండలో విద్యార్థుల ఒంటి మీద లాఠీలు విరిగాయి. దీన్ని నిరసిస్తూ హైదరాబాద్, సూర్యాపేట పట్టణాలలో నినాదాలు, ర్యాలీలు, బహిరంగ సభలతో తెలంగాణ అట్టుడికింది. తెలంగాణ ఐక్యవేదిక ఉద్యమ నాయకుడైన కేశవరావుజాదవ్ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఈ ఉద్యమం పోలీసు కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పులలో ఏడుగురు విద్యార్థులు నేలకొరిగారు. ఇదే దశలో కాళోజీ నారాయణరావు, జయశంకర్ తదితరులు ఈ ఉద్యమానికి మరింత ఊపు తీసుకొచ్చారు.
ఆంధ్రుల సృష్టి విశాలాంధ్ర
మహా భారతంలో శకునిలా మాయపాచికలతో పథక రచన చేసే ఆంధ్రులు, ఆంధ్రపాలకుల కుట్రల ఫలితంగా విశాలాంధ్ర ఉద్యమం బలం పుంజుకుంది. 1949లో అయ్యిదేవర కాళేశ్వర్‌రావు ఈ విశాలాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ విలీనానికి పాచికలు కదిపారు. ఆంధ్ర మహాసభలో సైతం ఈ ప్రస్తావన తీసుకురాగా అప్పటి ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ ఇది గాలి మాటగా కొట్టిపారేశారు. సుందరయ్య 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం', కమ్యూనిస్టుల ఒకే జాతి, ఒకే భాష. ఒకే రాష్ట్రం అన్న ప్రచారాన్ని ఉద్యమానికి ఊపునిచ్చాయి. కాంగ్రెస్‌కు తెలంగాణలో 1952లో జరిగిన ఎన్నికలలో అధిక సీట్లు రాకపోవడంతో ఈ ఉద్యమానికి మరింత ఊపునిచ్చారు. వీరి కుట్రల ఫలితంగా మొదట విజయవాడ అనుకున్నా తర్వాత కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అవతరించింది ఆంధ్ర ప్రాంతం నుంచి బెజవాడ గోపాల్‌రెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతులచ్చన్న, అల్లూరి సత్యనారాయణ, తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, కావిరంగారెడ్డి, మర్రిచెన్నారెడ్డి,జేవీ నర్సింగ్‌రావులు 1956 ఫిబ్రవరి 20వతేదీన ఢిల్లీలో సమావేశమై ఓ నిర్ణయానికి రాగా 1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
అమలుకు నోచని 14 సూత్రాలు
ఆంధ్రుల ఉక్కుపాదాలు తెలంగాణ ప్రాబల్యాన్ని అణిచివేసే ప్రక్రియ ఆక్షణం నుంచే ఆరంభమైంది. ఈ రాష్ట్రానికి ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రంగా పేరు పెడదామన్న తెలంగాణ నేతల వాదనను ఆక్షేపించిన ఆంధ్రనేతలు దీనిని ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండేందుకు గాను కేంద్రం సమక్షంలో ఆనాడే 14 సూత్రాలను రూపొందించారు. కానీ అవేవీ అమలులో లేవు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే మిగులు బడ్జెట్ ఆప్రాంతం అభివృద్ధికే కేటాయించాలని, మధ్య పాన నిషేధాన్ని తెలంగాణ వాసులు కోరితే అమలు చేయాలని, విద్యా, ఉద్యోగరంగాలలో తెలంగాణకు సంబంధించి ఇక్కడి వారికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగాల తీసివేత ఆయా ప్రాంతాల వారి నిష్పత్తిని బట్టే జరగాలని, ముఖ్యమంత్రిత్వ శాఖలలో ఏవేనీ రెండు శాఖలు తెలంగాణ నేతలకు అప్పగించాలని ఇలాంటి వన్నీ అందులో ఉన్నాయి. కానీ ఇన్నేళ్లలో వీటిలో ఏ ఒక్కటీ అమలు లోనికి రాలేదు. అణిచివేతలు, దురాక్రమణలు, అధిపత్యం, చివరికి అంత్యక్రియలలోనూ తెలంగాణ వాసుల పట్ల వివక్ష కొనసాగింది.
పాల్వంచలో మొదలైన ఉద్యమం
ఈ వివక్షను ఓర్వలేకపోయిన తెలంగాణ వాసుల గుండెలు అగ్ని గుండాల్లా రగిలిపోయాయి. ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం... ఇంకానా... ఇకపై సాగదు... అన్న శ్రీశ్రీ అక్షరాల సాక్షిగా ఖమ్మం జిల్లా పాల్వంచలోని ధర్మల్ పవర్ స్టేషన్‌లో 1969 జనవరి 5వ తేదీన మళ్లీ ఉద్యమం మొదలైంది. తెలంగాణ వాసులు కాని వారిని వెనక్కి పంపించాలన్న ఈ ఉద్యమం జనవరిలో నిజమాబాద్‌కు పాకింది. మర్రి చెన్నారెడ్డితో పాటు ప్రముఖులు సహకారం ఉండడంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉద్యమాలు, ర్యాలీలు, నినాదాలు, లాఠీఛార్జీలతో రాజధాని నగరమైన హైదరాబాద్ వేడెక్కింది. ఫలితం అప్పటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మనందరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపిస్తామని, తెలంగాణ నిధులలెక్క తేల్చి చెపుతామని, తెలంగాణ రక్షణ అమలు చేస్తామని చెప్పారు. హామీల ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చారు. కానీ ఆహామీలు కూడా అమలుకు నోచుకోలేదు. ఉద్యమ ఫలితంగా తెలంగాణ వాసులను రెండువేల ఉద్యోగాలు మాత్రం కేటాయించారు. ఇలా చెపుతూపోతే తెలంగాణ ఉద్యమం నిరంతరం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వాసుల గుండె నిత్యం రగిలిపోతూనే ఉంది

తెలంగాణ బిడ్డలారా.. తెలుసుకోండి!-2
ఆ పోరాటమే స్ఫూర్తి..
ఆనాటి మహామహుల పోరాటమే స్ఫూర్తిగా తిరిగి 1999లో కల్వకుంట చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభించారు. నానాటికీ పెచ్చుమీరుతున్న ఆంధ్రపాలకులను అణిచివేసి ఉద్యోగాలు లేక, ఉపాధి వనరులు లేక అల్లాడుతున్న తెలంగాణ నిరుపేదల గుండె మంటలు చల్లార్చేందుకు శ్రీకారం చుట్టుకున్నదే ఈ ఉద్యమం. 1999లో శ్రీకారం చుట్టుకున్న ఈ ఉద్యమం 2001 నాటికి ఊహించని రీతిలో బలోపేతమైంది. తెలంగాణ వాసులలో అంతర్లీనంగా దాగి ఉన్న ఆగ్రహ జ్వాలలు ఈ ఉద్యమం ద్వారా వెలుగులోనికి వచ్చాయి. తెలంగాణ మేధావులు, విద్యావంతులు, యువకులు, మహిళలు సైతం ఈ ఉద్యమం మనకోసమే నంటూ తోడు నిలిచారు.. నడుం బిగించి ముందుకు కదిలారు.. దీంతో పల్లెసీమలు, పట్టణాలు, తండాలు తెలంగాణ డప్పు చప్పుళ్లు, తెలంగాణ గీతాలతో మారుమోగాయి. పాలకులను తట్టి లేపాయి. ఫలితంగా పార్టీలు, పాలక వర్గాలు కూడా తెలంగాణ ఏర్పాటుకు తమ అంగీకారాన్ని తెలిపే దిశకు వారిని నడిపించిన ఘనత కేసీఆర్‌దే..
తెలంగాణ ఎందుకు..?
అవగాహన లేని వారి మనసుల్లో ఉద్భవించే తొలి ప్రశ్న ఇదే. ఇందుకు ఎన్నో సమాధానాలున్నాయి. అన్నింటికీ మించి తెలంగాణ ప్రగతి, తెలంగాణ వాసుల జీవితాలలో మార్పు ప్రత్యేక రాష్ట్రం మీదనే ఆధారపడి ఉంది. తెలంగాణ వస్తే కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదులు మన కళ్లముందే పారుతాయి. రైతుల కళ్లలో కాంతులు నిండుతాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.70 వేల కోట్లు ఉంటుంది. ఈ ఆదాయంతో సక్రమమైన ప్రణాళికల ద్వారా ఐదేళ్లలో రాష్ట్రాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దవచ్చు. కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగుల జీత భత్యాలకు రూ.15 వేల కోట్లు కేటాయిస్తే మిగతా రూ.55 వేల కోట్ల ద్వారా నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ, విద్యారంగాల సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి, వైద్యరంగం ప్రగతి వంటివి ఎన్నో చేపట్టవచ్చు. ఒక్కో జిల్లా అభివృద్ధికి రూ.5 వేల కోట్ల చొప్పున కేటాయించవచ్చు.
మన వనరులు మనకే..
సింగరేణి బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతున్న కరెంటు తెలంగాణకు మాత్రమే ఇచ్చుకుంటే రైతుకు 24 గంటల పాటు వ్యవసాయ విద్యుత్ ఇవ్వవచ్చు. విలీనానికి ముందు రూపకల్పన చేసిన ప్రాజెక్టులన్నింటినీ రెండేళ్ల కాలంలో పూర్తి చేయవచ్చు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించొచ్చు. వ్యవసాయ వృద్ధితో ఒనగూరే సంపదతో లక్షలాది మంది యువతకు పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి కల్పించవచ్చు. అక్షరాస్యతలో వెనుకబడిన తెలంగాణలో గ్రామానిక

ఒక్క రక్తపు బొట్టు రాలకుండా ఉద్యమాన్ని నడిపిద్దాం..!
తమ్ముల్లారా , చెల్లల్లారా .....! మరణాన్ని మనం శాసిద్దాం...! ఒక్క రక్తపు బొట్టు రాలకుండా ఉద్యమాన్ని నడిపిద్దాం ...! చావు దేనికీ సమాధానం కాదు .... బ్రతికి సాదిద్దాం ...వాదిద్దాం ...కాదంటే తెగవడి ..కలవడి ... రాష్ట్రాన్ని సాధించుకుందాం. మీరు మాత్రం తొందర పడేది లేదు. మనకు మనమున్నాం ..మనతో పాటు మన మేధావులు, ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, OU&KU JAC లు , ఉరూర వాడవాడనా ఊ అంటే చాలు ఉరికచ్చే ముక్కోటి జనసంద్రం వున్నరు. మీకు చింత అక్కర లేదు . మీ పరిది లో మీరు ఉద్యమిస్తే చాలు మిగతా అంతా మీ సహోదరులైన కోట్లాది తెలంగాణ వాదులం మేం జూసుకుంటం.
మీలో చిరునవ్వులు చూస్తేనే కదా మాలో ఉద్యమ స్పూర్తి రగిలేది ....మీ ఉరకలేసే ఉడుకు రక్తపుపిడికిలి కనిపిస్తేనే కదా మాకు పరుగులచ్చేది.... తమ్మీ మళ్ళీ మళ్ళీ చెపుతున్నాం ...మేమున్నాం మేమున్నాం మేమున్నాం.
కన్నవారి కడుపు కోత ను ఆలోచిద్దాం ... తెలంగాణ పులిబిడ్డలై బైలెల్దాం ..!
మన తల్లుల కడుపు కోతకు మనం కారణం కారాదు . వాళ్ళు మన మీద ఎన్నో ఆశలు వెట్టుకున్నరు. వారి శ్వాశ, ఆశ మనమే .... ! మన భవిష్యత్తు కోసమే వారి ఎదిరిచూపు ... దాన్ని తెలంగాణ లో సూడ దలిచిన్రు ... వాళ్ళ ఆశల్ని మనం అడియాశలు చేయరాదు. తమ్ముల్లారా ..... చెల్లెల్లారా ... మన ఆశ తెలంగాణ మన శ్వాశ తెలంగాణ ...దానికోసం దండు గడదాం .... దారి కి ముందు నడుద్దాం. ఎదురొచ్చిన ముండ్ల కంపల్ని ఏరుకుంట అగ్గివెడదాం.
ఇంకెప్పుడూ .... ఇలా తొందర పడమని నిర్నయిన్చుకుందం. నిలవడి నిప్పునైనా ఎదుర్కొందాం ... నిజాయితీగా పోరు చేద్దం ......కొదమ సింహాలై ముందుకురుకుదాం...!
తెలంగాణ తల్లి సాక్షిగా ప్రతిన తీసుకుందాం ..! మళ్ళీ ఎలాంటి కటిన నిర్ణయాలకు వెళ్ళమని... గర్భ శోకం మిగల్చమని.
రండి ...... ఇంటి దొంగల పనిపడదాం ..! బయటి దొంగల తరిమికొడదాం ...!
జై తెలంగాణ ..! జై జై తెలంగాణ ...!!

Subscribe to:
Posts (Atom)