Wednesday, August 11, 2010

తెలంగాణ బిడ్డలారా.. తెలుసుకోండి!-2

ఆ పోరాటమే స్ఫూర్తి..
ఆనాటి మహామహుల పోరాటమే స్ఫూర్తిగా తిరిగి 1999లో కల్వకుంట చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభించారు. నానాటికీ పెచ్చుమీరుతున్న ఆంధ్రపాలకులను అణిచివేసి ఉద్యోగాలు లేక, ఉపాధి వనరులు లేక అల్లాడుతున్న తెలంగాణ నిరుపేదల గుండె మంటలు చల్లార్చేందుకు శ్రీకారం చుట్టుకున్నదే ఈ ఉద్యమం. 1999లో శ్రీకారం చుట్టుకున్న ఈ ఉద్యమం 2001 నాటికి ఊహించని రీతిలో బలోపేతమైంది. తెలంగాణ వాసులలో అంతర్లీనంగా దాగి ఉన్న ఆగ్రహ జ్వాలలు ఈ ఉద్యమం ద్వారా వెలుగులోనికి వచ్చాయి. తెలంగాణ మేధావులు, విద్యావంతులు, యువకులు, మహిళలు సైతం ఈ ఉద్యమం మనకోసమే నంటూ తోడు నిలిచారు.. నడుం బిగించి ముందుకు కదిలారు.. దీంతో పల్లెసీమలు, పట్టణాలు, తండాలు తెలంగాణ డప్పు చప్పుళ్లు, తెలంగాణ గీతాలతో మారుమోగాయి. పాలకులను తట్టి లేపాయి. ఫలితంగా పార్టీలు, పాలక వర్గాలు కూడా తెలంగాణ ఏర్పాటుకు తమ అంగీకారాన్ని తెలిపే దిశకు వారిని నడిపించిన ఘనత కేసీఆర్‌దే..

తెలంగాణ ఎందుకు..?
అవగాహన లేని వారి మనసుల్లో ఉద్భవించే తొలి ప్రశ్న ఇదే. ఇందుకు ఎన్నో సమాధానాలున్నాయి. అన్నింటికీ మించి తెలంగాణ ప్రగతి, తెలంగాణ వాసుల జీవితాలలో మార్పు ప్రత్యేక రాష్ట్రం మీదనే ఆధారపడి ఉంది. తెలంగాణ వస్తే కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదులు మన కళ్లముందే పారుతాయి. రైతుల కళ్లలో కాంతులు నిండుతాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ రూ.70 వేల కోట్లు ఉంటుంది. ఈ ఆదాయంతో సక్రమమైన ప్రణాళికల ద్వారా ఐదేళ్లలో రాష్ట్రాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దవచ్చు. కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగుల జీత భత్యాలకు రూ.15 వేల కోట్లు కేటాయిస్తే మిగతా రూ.55 వేల కోట్ల ద్వారా నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ, విద్యారంగాల సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి, వైద్యరంగం ప్రగతి వంటివి ఎన్నో చేపట్టవచ్చు. ఒక్కో జిల్లా అభివృద్ధికి రూ.5 వేల కోట్ల చొప్పున కేటాయించవచ్చు.

మన వనరులు మనకే..
సింగరేణి బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతున్న కరెంటు తెలంగాణకు మాత్రమే ఇచ్చుకుంటే రైతుకు 24 గంటల పాటు వ్యవసాయ విద్యుత్‌ ఇవ్వవచ్చు. విలీనానికి ముందు రూపకల్పన చేసిన ప్రాజెక్టులన్నింటినీ రెండేళ్ల కాలంలో పూర్తి చేయవచ్చు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించొచ్చు. వ్యవసాయ వృద్ధితో ఒనగూరే సంపదతో లక్షలాది మంది యువతకు పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి కల్పించవచ్చు. అక్షరాస్యతలో వెనుకబడిన తెలంగాణలో గ్రామానిక

No comments:

Post a Comment