Tuesday, February 23, 2010

Telangana Mathru Gheetham

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనంముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనంతరతరాల
చరితగల తల్లీ నీరాజనంపది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణంజై
తెలంగాణ - జై జై తెలంగాణ


పొతనది పురిటిగడ్డ, రుద్రమది
వీరగడ్డగండరగండడు కొమురం భీముడే నీ బిడ్డకాకతీయ కళాప్రభల కాంతిరేఖ
రామప్పగొలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్ మినార్జై తెలంగాణ - జై జై
తెలంగాణ


జానపద జన జీవన జావలీలు జాలువారేకవి గాయక వైతాళిక కళలా
మంజీరాలుజాతిని జాగృత పరిచే గీతాల జన జాతరఅనునిత్యం నీ గానం అమ్మ నీవే మా
ప్రాణంజై తెలంగాణ - జై జై తెలంగాణ


సిరివెలుగులు విరజిమ్మే
సింగరేణి బంగారంఅణువనువు ఖనిజాలే నీ తనువుకు సింగారంసహజమైన వన సంపద
సక్కనైన పూవుల పొదసిరులు పండే సారమున్న మాగాణి కరములీయ జై తెలంగాణ - జై జై
తెలంగాణ

గొదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలిపచ్చని మాగాణాల్లో
పసిడి సిరులు పండాలిసుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలేస్వరాష్ట్ర్రమై
తెలంగాణ స్వర్ణ యుగం కావాలి
జై తెలంగాణ - జై జై తెలంగాణ
This is the OFFICAL songe of telangana..!!

written by the famous telangana poet ANDHE SHRI

No comments:

Post a Comment