Friday, March 26, 2010

ఓ .యు. విద్యార్థి గర్జన

ఓ .యు. విద్యార్థి గర్జన
ఓ యువరక్తపు ఘోషణ
రాజధాని నడిబొడ్డున
రగిలిన సంఘర్షణ

శతాబ్దాల గతమంతా
తిరగబడ్డ సోదరా ..
దశాబ్దాల కాలమంత
ధగాపడ్డ తమ్ముడా ..
వృధా కాదు నీ స్వేదం
యదార్థాల సాక్షిగా
యావత్ తెలంగాణా ఉంది
సదా నీకు తోడుగా ..

వాటాలు ఒకరికి
తూటాలు ఒకరికా?
మాటల్లో కోటలూ
చేతల్లో గోతులా ?
ఇక చాలు ఇక చాలు
బానిసపు బతుకులు
ఇకనైనా పీల్చనీయ్
స్వేచ్చా వాయువులు

కలిసొస్తే స్వాగతం
మా మనసులు సముద్రం
ఎదురొస్తే స్వేచ్చకు
విప్లవాల వీరులం

శ్రమ జీవులు, శ్రామికులూ
కర్షకులు కార్మికులూ
బడి పిల్లలు, మేధావులు
విడిపోతాం ఇకనైనా
సెలవంటూ చెపుతూంటే
వృద్ది అంటావ్, సమిష్టి అంటావ్
కలిసుండాలని శాసనం చేస్తావ్
ప్రజలంతా ఒకే మాటపై
నిలబడ్డారు అంటావేం
ప్రజలనే జాబితాలో
తెలంగాణ బిడ్డలను
ఇక నైనా చేర్చలేని
మాటలోని ఆ సత్యం
నీ చేతలోని ఔదార్యం
చూసి నిట్టూర్చే గదా
ఈ లోకం, నా ప్రాంతం
సమైక్యాంద్ర పదంలోనే
మతలబెందో అర్ధమాయే
తెలంగాణ కేక్కడిదిక నీ
నిఘంటువులో ఓ స్థానం

విడిపోయే వాన్నిగదా
ఓదార్చే అవసరం మరి
కలిసుండే వాని వెనుక
పడతారేం విడ్డూరం

నీది కాని గోచిపైన
ఎందుకింత కలకలం
పరాయి గడ్డమీద
ఏమిటింత పెత్తనం

ముళ్ళ మధ్య విరిసింది
అందమైన తామరం
తెలంగాణ గుండె రా
అది భాగ్యమైన నగరం

పువ్వు దోయ చూశావో
ఒళ్ళు గుల్ల తెలుసుకో మా
నవ్వు దోయ చూశావో
రేపు నీకు లేదుపో

No comments:

Post a Comment