Friday, March 26, 2010

నిజం ఉద్యమం, నివురు జర్నలిజం.......ఉస్మానియా విద్యార్థులు

ఉస్మానియా విద్యార్థులు - అందులో మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం అండతో పోలీసులు లాఠీచార్జ్ చేసి దారుణంగా హింసించారు. దీని వెనుక విద్యార్థుల తప్పులేదని ఇదంతా తెలంగానేతరుల కుట్రని తెలిసినా మీడియామాత్రం అంతగా స్పందించలేదు. ఇది కచ్చితంగా ప్రభుత్వం, పోలీసులు, మీడియా కలిసి పన్నిన కుట్ర. దీన్ని హైకోర్టు కూడా తప్పు పట్టింది  ..........

విశాల నిశీధి విలయతాండవం
వికార మానవ దురహంకారం
అనాది భారత యుగాల మడుగున
ఆరాధనతో ఆదిగకొలిచిన
మాతా, సోదరీ, యువతీ, దేవతా ..
నవీన భారత పునీత వనితా !


హక్కులకోసం పాకులాడితే ..
ఎదరొమ్ములపై పోలీసు బూటూ
పొత్తికడుపులో తుపాకిపోటు,
చెదిరిన జుట్టొక గుర్రపుకల్లెము
విద్యాలయమే నిలువెత్తు సాక్షము
నీ దేహమే తారురోడ్డుకు నేస్తము ..


చిమ్మ చీకట్లు సూర్యున్ని మింగేసినయ్ ..
నల్ల మబ్బులు చంద్రున్ని కమ్మేసినయ్ ..
వీదిదీపాలను డబ్బు చేతులు కప్పేసినయ్ ..
'ఆడ' పదాన్ని మహిళా సంఘాలు అమ్మేసినయ్ ..
మానవత్వాన్ని ప్రాంతీయతత్త్వం కొనేసింది !


లాఠీలు బాధ తాళలేక
                    ముక్కలుగా విరిగిపోయినయ్ !
రబ్బరు బుల్లెట్లు దారుణాన్ని చూడలేక సిగ్గుతో
                     యువత గుండెల్లో తల దాచుకున్నయ్ !!
అరుపులూ, కేకలూ, ఆక్రోశాలూ, ఆక్రందనలూ ..
రక్తాలూ, గాయాలూ, బాధలూ, వ్యధలూ ..
చిత్తు కాగితాలపై పిచ్చి భావాలయినయ్ !

హాస్టలురూము ఫ్యానూ, సెల్టవర్ అంచూ..
ఆడిటోరియం రూఫూ, బలిదానాలకు వేదికలయినయ్ !!

ద్రౌపది వ్యధనా? కీచక వధనా??
అంతులేని ప్రశ్నలరాత్రిని ' రోషం(?)' కమ్మేసింది
నిజం ఉద్యమం, నివురు జర్నలిజం..
నేనింకా బతికే ఉన్నానంటూ .
తెల్లవారగానే..ఉన్నత న్యాయస్థానం??

No comments:

Post a Comment