నా తెలంగాణ
అర్ధ శతాబ్దపు ఆగడాలకు బలియై పోయెను ఈ రాజ్యం
ఆత్మగౌరవం అన్న పేరుతో అవతరించిన ఆంధ్ర రాష్ట్రపు -
ఉక్కుకౌగిలికి కమిలి క్రుశించెను ఈ దేశం
భాష మాత్రమే ఏకమన్నది అందరెరిగిన సత్య వచనము
భావజాలపు బానిసత్వముకు కృంగి పోయెను ఈ ప్రాంతం
వన్నె తగ్గని సిరులు ఉన్నను వట్టిదైనది నా స్థానం
పుటములెరుగని చరిత ఉన్నది - పుట్టి మునిగిన గతము ఉన్నది
రక్తపు మడుగుల జాడలున్నవి - రాచరికపు గాధలున్నవి
శాతవాహనుల ఖ్యాతి ఉన్నది...కాకతీయుల ఖిలాలున్నవి
రామగుండపు వెలుగు ఉన్నది....బొగ్గుగనుల బహుమణులు ఉన్నది
సున్నపు రాయి గనులు ఉన్నది...రాతి పలకల నిలువలున్నది
జీవ నదుల ఆ సవ్వడున్నది - వాగు వంకలు బహు మెండుగున్నది
వనరులున్నను వనములున్నను వ్యర్థ బానిస బ్రతుకు అయినది
నక్సలిజం అను కుంటిసాకుతొ దగాపడ్డ ఈ ధరిత్రి నాది
కర్మాగారం, కార్మికగానం కలగలిసినది ఈ నేల
ధార్మిక స్థానం దైవిక క్షేత్రమై ఉద్ధరిల్లినది ఈ భూమి
తర తమ భేదాలెన్నో మరిచి మెలిగి వెలిగినది ఈ క్షేత్రం
రాజకీయ చదరంగానికి - పోరాటాల రణరంగానికి పావులై -రాటుతేలినది ఈ నా జనం!
తెలంగాణ సాధనకై కలిసి కదలినది కదం దాన్ని ఆపుట కాదు ఇంకెవ్వరి తరం !!
జై తెలంగాణ ------ జై జై తెలంగాణ
No comments:
Post a Comment