మిలియన్ మార్చ్ మామూలు విజయ౦ కాదు, అఖ౦డ విజయ౦... అమోఘవిజయ౦... అపూర్వవిజయ౦... అనిర్వచనీయమైన విజయ౦..! గర్వంగా ఫీల్ అవుతున్నా... అంతే కాదు, నిన్న జరిగిన మార్చ్ లో పాల్గోననందుకు చింతిస్తున్నా కుడా.....అనుకున్న కార్యక్రమాన్ని ఎన్నో అడ్డంకులకు ఓర్చి దిగ్విజయవంతం చేసినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు....
చెప్పడానికి మాటలు కూడా రావటం లేదు ఫోటోలు చూసినపుడు... నా ఒంట్లోని రక్తం ఉడుకుతోంది.. నేనెందుకు అక్కడ లేనా అని... ఒళ్ళు జలదరిస్తోంది.. తెలంగాణా వాడినై పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా.. అందులోను ఈ కాలంలో ఉన్నందుకు, ఇలాంటి గొప్ప గొప్ప సంఘటనలను కనీసం ఇంటర్నెట్ లో చూసే భాగ్యం దొరికినందుకు నేను గొప్పగా ఫీల్ అవుతున్నా... ప్రతి తెలంగాణా వాడికి మానసికంగా ఎంతో ధైర్యాన్ని చేకూర్చింది ఈ మిల్లియన్ మార్చ్ ...
దేవుడంటూ ఉంటె నేను ఒకటే కోరుకుంటా.. మరో జన్మంటూ ఉంటె దేవుడా, నన్ను మరో సారి కూడా ఈ తెలంగాణా వాడిగా పుట్టించు... ఈ తల్లి ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను....
ఈ ప్రభుత్వం మన ప్రజల సమస్యలను అసలు పట్టించుకోదా అనే ఒక నిరాశ, నిస్పృహలతో కూడిన సామాన్య తెలంగాణా వాడికి.... ఎన్ని రోజులు చేయాలా ఈ ఉద్యమం అన్న దిగులుతో... ఇక చాలు మన బతుకేదో మనం బతుకుదాం బానిస బతుకైన సరే, అనే ఒక చాతకాని తనం వస్తున్న తరుణం లో చేపట్టిన ఈ మిల్లియన్ మార్చ్ ఒక మంచి మానసిక ధైర్యాన్ని మాత్రమే కాదు సాధించే దాక తెగించి పోరాడుడే అని తెగించి పోరాడే తత్వాన్ని తెలంగాణా ప్రజల్లో ఎన్నో రెట్లు పెంచింది...
శత్రు చక్రభందంలో చిక్కుకున్న అభిమన్యుడి వలె ప్రతి తెలంగాణా వాడు అడుగడుగునా ఉన్న పోలీసు చక్రభంధాన్ని దాటుకుని ట్యాంక్ బాండ్ కు నేను సైతం అంటూ చేరుకున్న తీరు, మనవారి తెగింపు, స్థైర్యం, స్ఫూర్తి అమోఘం... అపూర్వం... అనిర్వచనీయం... మొత్తం 350 కి పైగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను, అడుగడుగునా చేస్తున్న తనికీలను సైతం దాటుకుంటూ, ఫోటోల్లోని ఒక్కొక్క తెలంగాణా పౌరుడిని చూస్తుంటే వారి మొహాల్లో ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం, ఏదో సాధించాం అన్న ఒక ఫీలింగ్, తనను మించిన వాడు ఈ ప్రపంచంలోనే ఇంకొకడు లేదు అన్న రేంజ్ లో ఉంది ... ఇలాంటి స్ఫూర్తి, ఇలాంటి ఆనందం ప్రతి రోజు ఉండాలి మన వాళ్ళలో... మనం చూడాలి కూడా ... ఉండేలా మనం చేయాలి కూడా... ఆ భాద్యత మనమీదనే ఉంది..
ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప స్థాయిలో దిగ్విజయం చేసి, ప్రపంచానికే ఒక పాటాన్ని నేర్పించడానికి పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్పూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణా అభివందనాలు...
ఒక పక్క తెలంగాణా ప్రజలు మిల్లియన్ మార్చ్ కి సిద్ధం ఆతుంటే ప్రభుత్వం పోలీసు మార్చ్ చేయించింది తెలంగాణా జిల్లాల్లో.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే, ఇది మన భాగ్య నగరమేనా అన్నట్లుంది... అరెస్టులతో తెలంగాణా ప్రజలను, నాయకులను, విద్యార్థులను ఎక్కడికక్కడే బంధించాలని చూస్తుంటే ఈ దశలోనూ తెలంగాణా వారు తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు, పైగా వారి ఆత్మస్థైర్యం రెట్టింపు అయి ఎలాగైనా ఈ మిల్లియన్ మార్చ్ లో నేను కూడా పాల్గొనాలని గట్టిగ నిశ్చయిన్చుకోనేలా చేసాయి...నర నరాన రక్తం ఉడికిపోతోంది..
ఇంకా తెలివిగా ప్రభుత్వం, మార్చ్ కి 24 గంటల ముందు మొత్తం ఒక లక్ష మందిని అరెస్టు చేసిందంటే అది నమ్మశక్యం కాదు.. కాని అది నిజం..నమ్మి తీరాల్సిందే.. దాదాపు తెలంగాణా లోని అన్ని యునివేర్సిటిల్లోని విధ్యర్తులన్దరిని అరెస్టు చేసారు,, జై తెలంగాణా అన్నా ప్రతి నాయకుణ్ణి, కార్యకర్తని అరెస్టు చేసి బొక్కలో పెట్టారు.. ఒక దశలో ప్రతి తల్లి తన కొడుక్కి వీర తిలకం దిద్ది, జై తెలంగాణా అని పంపించేలా ఉసి గోల్పాయి ఈ ప్రభుత్వపు చేష్టలు... నాకు తెలిసినా నా మిత్ర్హులు కొందరు ఇదే విషయం చెపారు.. మిల్లియన్ మార్చ్ కి వేల్లెముందర వారి తల్లి ఇంట్లో వీర తిలకం దిద్ది, జై తెలంగాణా అని చెయ్యెత్తి జై కొట్టి, మరీ పంపిందంట, ఒక వీరుడి తల్లి వలె... ఇలాంటి పరిస్తితుల్లో, అనుమతి లేదంటూ పోలీసు ఉన్నతాధికారులు అతిగా ప్రవర్తించి, ఉదయమే TG -JAC చైర్మన్ ఐన ప్రొఫ్. కొదండ్ రామ్ ని అరెస్టు చేసి ప్రజలను రెచ్చగొట్టింది ఈ ప్రభుత్వం... ఇక ఈ కార్యక్రమాన్ని ముందుంది నడిపించే దిక్కు లేకుండా చేసారు.. అయినా కూడా ఎవరు ఎలాంటి సహనం కోల్పోకుండా, కార్యక్రమాన్ని ఎవరికీ వారే ముందుకు తీసుకు వెళ్లి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు అభినందనీయులే...
ఇక ఈ కార్యక్రమంలో అనుకోకుండా చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను కొంత మంది కావాలని భూతద్దంలో పెట్టి చూస్తూ మరీ, పెద్దగ చేస్తుండడం చూస్తే చాల భాదేస్తోంది.. ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 6 దశాబ్దాలుగా తెలంగాణా వారికి అన్యాయం జరుగుతుంటే ఎవరికీ కూడా గుర్తుకు రాని తెలుగు వారు ఆత్మగౌరవం, ఎన్నో సంవత్సరాలుగా పోరాడి తెచుకున్న తెలంగాణా ను రాత్రికి రాత్రే అర్ధరాత్రిలో లాగేసుకున్నపుడు గుర్తుకురాని ఈ ఆత్మాభిమానం, ఏం చేయాలో తెలీని దిక్కు తోచని పరిస్థితుల్లో 600 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నపుడు గుర్తుకు రాణి ఈ గొప్పతనం, ఒట్టి మట్టి బొమ్మలను పగులగోడితే గుర్తుకువచింది ఈ తెలుగు వారికి.... ఈ దాడిని ఒక ఆంధ్ర పెత్తందారుల మీద జరిగిన దాడిగా గుర్తించాలే తప్ప, వ్యక్తుల మీద జరిగిన దాడిగా గుర్తించకూడదు... అయినా అక్కడికి వచ్చింది లక్షల మంది జనం, విధ్వంసానికి పాల్పడింది కొన్ని వందల మంది కూడా కాదు... దీనికే, ఒక TV (TV-9)ఛానల్ లో అయితే వెర్రి కూతలతో మొత్తం ఉద్యమాన్నే కించపరిచేలా వాఖ్యలు చేసింది... ఆ ఛానల్ వాడికి అసలు కళ్ళు ఉన్నాయా...?? చెవులు ఉన్నాయా....? ఉంటె ఏమయి పోయాయి... కొన్ని లక్షల మంది ఊరూరా దీక్షలు చేస్తుంటే కళ్ళు దొబ్బాయా.. చెవులు మూసుకుపోయాయా..?? అసలు ఇలాంటి వాళ్ళను ఇంకా హైదరాబాద్ లో ఉండనిస్తున్నందుకు ప్రతి తెలంగాణా వాడు మనసులో ఎంతో భాదపడుతూ ఉంటాడు... ఇలాంటి విధ్వసానికి దిగడానికి కారణం ఐన కొన్నింటిని మనం అర్ధం చేసుకోవాలి ఇక్కడ,, ముఖ్యంగా ఎంతో ప్రశాంతంగా చేయాలనుకున్న మిల్లియన్ మార్చ్ ని కావాలని పోలీసులను విచ్చలవిడిగా రప్పించి విధ్వంసభరితం చేసింది ఈ ప్రభుత్వం.. అసలు నాకో పెద్ద డౌటు ఏంటంటే, ఈ విధ్వంసాలకు పాల్పడింది మఫ్టీ లో ఉన్న పోలీసులే అని.. లేదంటే సీమంధ్ర పెత్తందారుల తొత్తులు ఎవరైనా ఉద్యమంలోకి వచ్చి అసలు ఉద్యమ కారులను ప్రేరేపించి ఐన ఉండాలి... అసలు తెలంగాణా ప్రజలే గనక ఈ విగ్రహాలు ఇక్కడ ఉండొద్దు అని అనుకున్నా, తెలంగాణా ఉద్యమం అన్నది పిచోది చేతిలో రాయి అని కొన్ని చాన్నేల్లు అనుకున్నట్టు అయితే, ఇపటికి ఎప్పుడో ఈ పని చేసి ఉండేవారు.. ఇలా విగ్రహాలను ధ్వంసం చేయొద్దని అక్కడ ఉన్న ఎంతో మంది ప్రొఫెసర్లు, ఉద్యమ నేతలు కోరినా వారిని నెట్టేసి, ఈ పని చేసారంటే ఖచ్చితంగా ఇది ఉద్యమాన్ని నీరుగార్చాలని కొంతమంది పెత్తందారులు చెపితే చేసిన పనే... అంతే కాని ఇది ఉద్యమ కారులు చేసిన పని ఎంత మాత్రం కాదు... దీనిని ఇంకో కోణంలో కూడా ఆలోచించాలి... తెలంగాణాకు, హైదరాబాద్ కు నది బొడ్డు ఐన ట్యాంక్ బాండ్ పై కొంత మంది తెలంగాణాకు చెందినా వారివి విగ్రహాలు పెట్టాలని తెలంగాణా ప్రజలు ఎపటినుందో కోరుతున్నారు. దేనికి సానుకూలంగా 7 ,8 నెలల క్రితం కొమురం భీమ్ విగ్రహ స్థాపనకు ప్రభుత్వం ముందుకు వచినా ఇపతివరకు దానికి సంభందించిన పనులు మొదలు కాలేదంటే ప్రభుత్వం యొక్క అలసత్వాన్ని మనం అర్ధం చేసుకోవచు.. ఇది తెలంగాణా వారిని కావాలని చిన్న చూపు చూస్తున్నట్లుగా కాదా???? ఇదే కోపం లో, కొంత మంది ఆవేశపరులు చేసిన పనిగా కూడా మనం దీనిని అర్ధం చేసుకోవచ్చు .. అసలు ఈ విధ్వంసాలకు దారి తీసిన కారణాలను, పరిస్థితులను మనం అర్ధం చేసుకోవాలి కాని నోటికి వచ్చిందే చందం అన్నవిధంగా అనకూడదు... ఇంకా విగ్రహాల మీదనే కాదు అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకుల మీద కూడా ప్రజలు తమ కోపం చుపెట్టారంటే ఇది ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదని గ్రహించాలి... ప్రజల కోపం తాకిడి కెసిఆర్ ను సైతం తాకింది... KCR సెక్యూరిటీ వాహనాన్ని ధ్వంసం చేసారంటే పరిస్థితి ఎంత ఉద్విగ్నభరితంగా ఉందొ అర్ధం చేసుకోవాలి...
ఒకే ప్రాంతానికి వంత పాడే ఒక వెబ్ సైట్ లోనైతే, ఏకంగా, '' మనుషులం అన్న సంగతే మరచిపోతే, ఇక ప్రాంతాలేందుకు, రాజ్యాంగం ఎందుకు , ప్రభుత్వం ఎందుకు'' అంటూ స్టేట్మెంట్ లు .. అవును నేను కూడా అదే అంట... ఈ దాడి మనుషుల మీద జరగలేదు అన్న విషయం గుర్చుంచుకోండి... మనుషుల మీద దాడులు జరుగుతుంటే ఇలాంటి వారికి ఇవన్ని ఎందుకు గుర్తుకు రావో...??? ఇంకా మిల్లియన్ మార్చ్ ని మిలిటెంట్ మార్చ్ గా అభివర్ణించారు కొందరు మేథా(తా)వులు.... అసలు ఇంత వరకు జరిగిన తెలంగాణ ఎలా ఉందొ కూడా తెలీనట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు.... పైగా తెలుగోడు తల దించుకోవాలి, రాష్ట్ర చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ అరుస్తున్నారు, అసలు ఏ రోజు కాదు బ్లాక్ డే, తెలంగాణ ప్రజలను మభ్య పెట్టిన ఇన్ని రోజులు బ్లాక్ డే నే, దానికి సిగ్గుతో తల దించుకోవాలి అసలు సిగ్గు సారం ఎమన్నా ఉంటె...... అసలు మిలిటెంట్ ఉద్యమం ఈ సీమంధ్ర పెట్టుబడిదారులకు చుపెట్టాలనుకుంటే ఎపుడో చూపెట్టే వారు ఈ తెలంగాణా ప్రజలు.. ప్రజాస్వామ్యానికి కట్టుబడి, రాజ్యాంగ బద్దం గా చేస్తున్న తెలంగాణ ఉద్యమం ఇది.. ఇంకా కొన్ని పత్రికలైతే విధ్వంసాల మార్చ్ అంటూ విధ్వంసం సృష్టించాయి.. ఐనా లక్షల మంది వచ్చినపుడు, ముందుండి నడిపించే నాయకుణ్ణి దిగ్భందం చేసినపుడు ఏమి చేయాలో తెలీని ప్రజలు ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే తెలంగాణ ప్రజల ఓపికను అర్ధం చేసుకోవాలి... ఇదే ఘటన వేరే ఈ దేశంలో గనక జరిగితే తెలిసేది అసలు ఏమయ్యేదో... అసలు వేరే దేశం ఎందుకు వేరే రాష్ట్రంలో జరిగితే ఏం అయ్యేదో తెలిసేది ప్రభుత్వానికి...
ఇంకా కొందరు అయితే అబద్దపు పెళ్లి చేసి మరీ ట్యాంక్ బాండ్ మీదకి వచ్చారంటే ప్రజలు ఎంత బలంగా అనుకున్నారో అర్ధం చేసుకోవచ్చు... ముందే చెపిన సమయం కంటే అర గంట ముందు వరకు కూడా ఎవరు ఊహించి ఉండరు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని.. ప్రతి తెలంగాణ వ్యక్తి స్వచ్చందంగా ముందుకు వచ్చారు... మహిళలు కూడా మేము సైతం అంటూ పిల్లలతో ముందుకు వచ్చారు...ఒకే ఒక్క గంటలో ట్యాంక్ బాండ్, దాని పరిసరాలు మొత్తం మారిపోయాయి... పోద్దటినుండి పోలీసుల కవాతులతో ప్రశాంతంగా ఉన్న ట్యాంక్ బాండ్, ఒక్కసారిగా హోరెత్తిన జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది... అరగంట వ్యవధిలో బుద్దుడి సాక్షిగా ట్యాంక్ బాండ్ అంతా జనసంధ్రమయింది... పరిస్థితి పూర్తిగా పోలీసుల చేయి దాటి తెలంగాణ ప్రజల్లోకి వెళ్లిపోయింది.. అందరి నోట ఒకటే మాట- జై తెలంగాణ అని.... ఎంతో మంది ఎన్నో ప్రయాసలకు ఓర్చుకొని దిగ్విజయం చేయడానికి పూనుకొని వచారు... తెలంగాణ జిల్లాల నుండి హైదరాబాద్ కి వచ్చేవారిని కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో అడుగడుగునా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, మరి ఇంత మంది ఎలా వచ్చారు, ఎకడనుండి వచాఋ అన్నది అర్ధం చేసుకోవాలి... అంతే కాదు, హైదరాబాద్ లో అసలు ఉద్యమమే లేదు అనేవారికి ఇదొక గుణపాటం కుడా... గమనించాల్సింది ఏంటంటే, ఈ మార్చ్ లో పాల్గొన్న వారు దాదాపుగా అందరూ హైదరాబాద్ లోని వారే... అంటే ఇపటికైన ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ లోని ప్రతి ఒక్కరు, తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు, వారి ఆశ, శ్వాస అంతా తెలంగాణే అని... ఇంత కన్నా ఇంకేం చేయాలి ఏ తెలంగాణ ప్రజలు......???
అసలు ఈజిప్టులో ముబారక్ సైతం ప్రజల ఆకాంక్షకు తల వంచాడు, శాంతియుత ర్యాలి కి అనుమతి ఇచ్చాడు, కాని ఏ మన ప్రజాస్వామ్య దేశంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ భారతదేశంలో ఎలాంటి హక్కులు లేవు... దీనికి ప్రతి ఒక్కరు సిగ్గుతో తలదించుకోవాలి... ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన సమయం ఇది.... ఒక ప్రాంతానికి చెందిన 4 కోట్ల మంది ప్రజలు ఒక్కటై తమ ఆత్మ గౌరవం కోసం, తమ గుర్తింపు కోసం, తమ హక్కుల కోసం గొంతెత్తి ఒకే చోట చేరడం అన్నది భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భం... కానీ, ఒక్కటే అర్ధం కానీ విషయం ఏంటంటే, ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రాంతానికి చెందిన 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు విలువ లేకపోవడం అన్నది మన ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు...
మీ,
దీపం,
please my blog & source- nanokiran.blogspot.com
KIRAN DASARI
No comments:
Post a Comment