Tuesday, March 22, 2011

నా ప్రశ్న ??????




జనాల కోసం వేచే జగతిన జాగృతి ఉంటుందా?



వనాల తిరిగే జాతికి ఇలలో విలాసముంటుందా?



సమగ్రతంటే తెలియని వారిలొ సమైక్యతుంటుందా?



స్వతంత్ర్య దేశపు పౌరుల బ్రతుకున సుశాంతి ఉంటుందా ?



అభాగ్య జీవుల కలిలొ నిలిచే విషాద భారతమా



శ్రామిక జీవుల శక్తిని దోచే దగాల భారతమా



కర్షక జీవుల స్వేదం పీల్చే దళారి భారతమా



దొరలుగ పిలిచే దొంగలు ఉన్న దరిద్ర భారతమా



దోపిడికారుల మదిలో మెదిలే విలాస భారతమా



ప్రజానీకమే రాజ్యమేలునను ప్రజస్వామ్యమిదిరా



విధానమంటూ నిజాన్ని దాచే అ-ప్రజస్వామ్యమిదిరా !





మతాల పేరున మంటలు రేపిన నాయకుడంటారా?



మనుగడ కోసం పోరే వాడిని “మావో “అంటారా?



మట్టిని, పుట్టను, చెట్టును సైతం మలినం చేస్తారా?



సెజ్ (SEZ) ల పేరిట అడవులు కూడ కననం చేస్తారా?



అడిగిన వారిని అన్నలు అంటు తన్నుతు(చంపుతు) ఉంటారా?





పెన్నును గన్నుగ మార్చే కవినని నన్నేమంటావో?



కవితగ వచ్చిన పదమును కూడ నక్సల్ అంటావో?



తెలిసే చేసిన తప్పుకు నువ్వు తపించి పొతావో



తెలియక చేసిన ఒప్పనుకొని నువు తరించిపొతావొ



(విసిగి) వేచిన పౌరుల మదిలొ నిలిచే వికృత అగత్యమా?



జవాబు తెలిపే బాధ్యత ఉన్న జనాల ప్రభుత్వమా ---------!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

జవాబు తెలిపే బాధ్యత ఉన్న జనాల ప్రభుత్వమా ---------!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

No comments:

Post a Comment