Saturday, August 7, 2010

ఎల్లువ

ఇంతింతై
వామనుడు వాడు
చూడగ కొండంతై..
ఉరకల ఉద్యమం..
పదుగుల పొద్దుల
ఎలుగుల ఎల్లువ...
జిలుగుల ఎన్నెల..
మల్లి కురిసెను కొన్ని
స్వాతి చినుకులు..
తడిసిన మొలకల మొదల్లు..
పచ్చిగ తాకెనడుగులు..
పచ్చగ మెరిసెను చిగురులు..
ఒక్కొక్కటిగ
మరొక్కటిగ.. ..
చినుకు చినుకు..
మిణుకు మిణుకు..
పరుగు ఉరక..
కోట్లుగ జతగ..
సవ్వడి చేసెను శంఖారావం..
లెవ్వగ పాడెను సంధ్యారాగం..
రేపటి లోకం..
చీకటి తోలగ..
అడుగున పదమై..

No comments:

Post a Comment