Saturday, August 7, 2010

ఎల్లువ

సల్లని సాయంకాలం
అసుర సంధ్యై
అదరగొడుతున్నది..
వడగాల్పులు..
విషమేదో
విధితలపై
విహరిస్తున్నట్టు..
..
తలవంచని
శిరసులన్ని
తెగిపడుతున్నవి..
కారుతున్న రుధిరమే
ఇంధనమై..
కనులు నిప్పు కణికలై..
మాటలు పాటలు
మంటల పాలయి
మసిబారినవి..
ఓదార్పులు
ఓర్వని తలపులు
తగని చెలిములు..
ఉరికోతలు
ఊచకోతలు..
తడి గుడ్డలతో
తెగిపడిన తలలు..
ఊరు వాడ
దినము దిక్కు
మంటలు ..
తెగిన గొంతులు..
రొద పెట్టు
గుడి బడి గంటలు..

No comments:

Post a Comment