Saturday, August 7, 2010

ఎల్లువ

పదమే ప్రళయమై..
జనం ప్రభంజనం..
రణమే నినదం..
పలుకే ప్రవహం..
ఉరుకే ఉద్యమం..
అణువణువు ప్రతి కణం..
తెలంగాణం..
అడుగడుగు ప్రతి గణం..
తెలంగాణం..
గుండెపాడు చివరి గానం..
తెలంగాణం..
రగులుతున్న నిప్పుకణం..
తెలంగాణం..
తిరుగు బాటు ధిక్కార నాదం..
తెలంగాణం..
బిగిసిన కోటి పిడికిళ్ళ ఉక్కు బలం..
తెలంగాణం..
రాలే వడగళ్ళ పోరాట స్వరూపం..
తెలంగాణం..
కన్నీటి కడగళ్ళ రౌద్ర రూపం..
తెలంగాణం..
అమరవీరుల ఆఖరి వందనం
తెలంగాణం..
తెలంగాణ..
తెచ్చేదాకా ..
వచ్చేదాకా..
చూసేదాకా..
తరం తరం నిరంతరం..
శ్రమిస్తాం అహోరాత్రం..
జై తెలంగాణ..
జై జై తెలంగాణ

No comments:

Post a Comment