విద్యార్థులూ చీలారు. జాక్‌లూ చీలి మళ్లీ నిర్మితమయ్యా యి. ఊరు బతికే ఉంది. ఉపాసం ఉంటూనే ఉంది. పల్లె బతికే ఉంది. అది తెలంగాణ పదం పాడుతూనే ఉంది. చిరంజీవి... తెలంగాణ వస్తే మావోయిస్టులు రాజ్యానికి వస్తారని భయపెట్టి తెలంగాణను అవమానిస్తూనే ఉన్నాడు. కొత్తగా కామ్రేడ్ రాఘవులు తెలంగాణ వస్తే మత కల్లోలాలు చెలరేగుతాయని మార్క్సిస్టు-లెనినిస్టు సరికొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టారు. కమ్యూనిస్టు పోరాట యోధులను చాకలి ఐలమ్మ, బందగీ, దొడ్డి కొమురయ్యల స్మృతినీ అవమానించాడు.
ఒకరు తెలంగాణలో నూటికి 80 శాతం మంది సమైక్యాంధ్ర కోరుతున్నారంటారు. మరొకరు తెలంగాణ సస్యశ్యామల అన్నపూర్ణ అంటారు. మిత్రుని మెయిల్ సూచించినట్టే అవమానాల భారం అవని అంత పెరుగుతున్నది. కానీ 'జాక్'లు ఎందుకు చీలాయో? ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మిగిలే ఉంది. తీహార్ జైలు నుంచి ఈ మధ్య కోబాడ్ గాంధీ ఆయన సహచరురాలు అనూరాధ గురించి రాస్తూ అధికారం-ఒక చిన్న అధికారం కూడా అవినీతికి, పతనానికి దారి తీస్తున్న చోట, అహం, స్వప్రయోజనా లు, నాయకత్వం, పేరు ప్రతిష్టల కోసం ఆరాట పడుతూ ఉద్యమాలను నీరుకారుస్తున్న చోట అనూరాధ ఈ చెద అంటకుండా బతికారని కీర్తించారు.
ఈ తెలంగాణ ఉద్యమానికీ అదే చెద .....ఈ కపట కాలపు అగడ్తలయిన వ్యక్తి కేంద్రక బలహీనతలను అధిగమించకుండా తెలంగాణ ఉద్యమకారులు.. ఇక్కడి ప్రజలకు నాయకత్వం వహించలేరు. తెలంగాణ ప్రజ లు గొప్పవాళ్లు... వాళ్లకు నాయకత్వం వహించే వాళ్లే........ఈ ఖాళీని చరిత్ర పూరిస్తుంది.
No comments:
Post a Comment